అంతకుమించి అంటున్న ఛార్మి
Advertisement
CJ Advs
చిరు 150వ సినిమాకి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించబోతున్నాడన్న విషయం అలా ఖరారైందో లేదో... ఇలా వెంటనే ఛార్మి అందులో ఐటెమ్‌సాంగ్ చేయబోతోందంట అని ప్రచారం మొదలైంది. అందుకు కారణం పూరితో ఛార్మి సన్నిహితంగా మెలుగుతుండటం, పూరితో కలిసి `జ్యోతిలక్ష్మీ` సినిమా చేయడమే. అయితే అదే విషయాన్ని ఛార్మి దగ్గర ప్రస్తావిస్తే కయ్యమని లేచింది. చిరు సినిమాలో నేను ఐటెమ్ పాటొక్కటే చేయాలా? అంతకుమించి చేయకూడదా? అని ఎదురు ప్రశ్నించింది. దీన్నిబట్టి ఛార్మి పెద్ద స్కెచ్చే వేసిందని అర్థమవుతోంది. ఐటెమ్ గాళ్‌గా మాత్రమే కాకుండా... అవకాశమొస్తే కథానాయికగా కూడా నటించాలని ఛార్మి భావిస్తున్నట్టు తెలుస్తోంది. `జ్యోతిలక్ష్మి` హిట్టయ్యి, ఛార్మి మళ్లీ ఫామ్‌లోకి వస్తే మాత్రం అది జరిగినా జరగొచ్చని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తమ్మీద `జ్యోతిలక్ష్మి`తో ఛార్మి తన కెరీర్‌ని మలుపు తిప్పుకోవాలని డిసైడ్ అయ్యింది.
Show comments
Advertisement
Google Ad amp 3
CJ Ads
Advertisement
Google Ad amp 3
CJ Ads