కొంతమందికి కొన్ని పాత్రలు భలే కుదురుతుంటాయి. అలా ఆదాశర్మకి పెళ్లి కూతురు పాత్రలు బాగా కుదురుతున్నాయి. ఇప్పటిదాకా ఆమె సినిమాల కోసం ఐదుసార్లు పెళ్లి కూతురైంది. అదో రికార్డుగా చెప్పుకొంటోంది ఆదా. `హార్ట్ ఎటాక్`తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ఆదా. ఆ తరవాత సన్నాఫ్ సత్యమూర్తిలో ఓ పాత్రలోనూ మెరిసింది. ఇప్పటి వరకూ తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో 8 సినిమాలు చేసింది ఆదా. వాటిలో ఐదు సినిమాల్లో పెళ్లి కూతురు గెటప్ వేసింది. `హార్ట్ ఎటాక్`, `సన్నాఫ్ సత్యమూర్తి`లతో పాటు హిందీ సినిమా `హసీ తో ఫసీ`, కన్నడ చిత్రం `రానా విక్రమ` చిత్రాల్లో పెళ్లి కూతురు గెటప్‌లో కనిపించింది ఆదా. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్‌తో కలిసి `సుబ్రమణ్యం ఫర్ సేల్` చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలోనూ ఆమె పెళ్లి కూతురుగానే కనిపించబోతోంది. ఆ సినిమా సెట్లో తాను పెళ్లి కూతురు గెటప్‌లో ఉండగా ఓ స్టిల్ తీసి సోషల్ నెట్ వర్కింగ్ సైట్‌లో అప్‌లోడ్ చేసి తన పెళ్లి రికార్డును బయటపెట్టింది.
Advertisement
CJ Advs