Advertisement
CJ Advs
ఏమాయ చేసావె... కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో సమంత ఒక్కటీ లేదు కానీ... మిగతా అంతా సేమ్ టు సేమ్. అయితే సమంత ప్లేస్‌లో ఈసారి మలయాళం నుంచి మంజిమ మోహన్ అనే ముద్దుగమ్మని తీసుకొచ్చాడు గౌతమ్‌మీనన్. చైతూ ఈ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాడు. మళ్లీ `ఏమాయ చేసావె` తరహా మేజిక్ రిపీట్ అవుతుందని ఆయన ఆశపడుతున్నాడు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. నాగచైతన్యనీ, మంజిమ మహేష్‌నీ ఓ బుల్లెట్‌పై ఎక్కించి హైవేకి తీసుకొచ్చాడు దర్శకుడు గౌతమ్‌మీనన్. ఆ సన్నివేశాల చిత్రీకరణకి సంబంధించి కొన్ని స్టిల్స్ బయటికొచ్చాయి. అందులో ఇదొకటి. చూస్తుంటే చైతూ, మంజిమ జంట ముద్దొచ్చేలా ఉంది కదూ! అన్నట్టు ఇదే చిత్రాన్ని తమిళంలో శింబుతో తెరకెక్కిస్తున్నారు గౌతమ్‌మీనన్. శింబు సినిమాకి సంబంధించి కూడా ఇలాంటి స్టిల్లే బయటికొచ్చింది. `ఏమాయ చేసావె`ని కూడా తెలుగులో నాగచైతన్య, తమిళంలో శింబు చేశాడు.