ఛార్మి ప్రధానపాత్రలో ఛార్మి కౌర్ సమర్పణలో సి.కె.ఎంటర్‌టైన్మెంట్ ప్రై.లి., శ్రీశుభశ్వేత ఫిలిమ్స్ బ్యానర్స్‌పై డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో శ్వేతలానా, వరుణ్, తేజ్, సి.వి.రావు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘జ్యోతిలక్ష్మీ’. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. జూన్ 12న ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేస్తున్నారు నిర్మాతలు.
ఈ సందర్భంగా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సి.కళ్యాణ్ మాట్లాడుతూ ` ‘‘మా ‘జ్యోతిలక్ష్మీ’ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్ పొందింది. సెన్సార్ పూర్తయిన అనంతరం సెన్సార్ సభ్యులు సినిమా చాలా బాగుందని ప్రశంసించారు. జ్యోతిలక్ష్మీగా నటించిన ఛార్మిని, డైరెక్ట్ చేసిన పూరి జగన్నాథ్‌ని అప్రిషియేట్ చేశారు. నిన్న రిలీజ్ అయిన ఆడియోకి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆడియో రిలీజ్‌కి ముందే టైటిల్ సాంగ్‌ని రిలీజ్ చెయ్యడం జరిగింది. ఆ పాటకి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. చార్మికి, పూరి జగన్నాథ్‌గారికి ‘జ్యోతిలక్ష్మీ’ ఓ మెమరబుల్ మూవీ అవుతుంది. అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అంశాలున్న ఈ చిత్రం మా బేనర్‌లో మరో సూపర్‌హిట్ సినిమా అవుతుందన్న నమ్మకం నాకు వుంది. ఈ చిత్రాన్ని జూన్ 12న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు.
ఛార్మి, సత్య, వంశీ ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, కెమెరా: పి.జి.విందా, నిర్మాతలు: శ్వేతలానా, వరుణ్, తేజ, సి.వి.రావు, దర్శకత్వం: పూరి జగన్నాథ్.