మోహన్‌బాబు కొత్త చిత్రం
గతేడాది నుంచి మోహన్‌బాబు జోరు పెంచారు. అంతకుముందు తన కొడుకుల సినిమాలకి సంబంధించిన వ్యవహారాల్ని చక్కబెట్టిన ఆయన `పాండవులు పాండవులు తుమ్మెద`తో మళ్లీ కెమెరా ముందుకొచ్చారు. `రౌడీ`, `యమలీల2`లాంటి చిత్రాల్లో నటించారు. ఈ యేడాది కూడా ఆయన వరుసగా సినిమాలు చేయాలని ప్లాన్ చేసుకొంటున్నాడు. మంచి కథలు దొరికితే సోలోగా కూడా సినిమాలు చేయాలనేది మోహన్‌బాబు ఆలోచన. ఆ మేరకు ఇటీవలే ఓ కథకి పచ్చజెండా ఊపేశారు. `ఢమరుకం` ఫేమ్ శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం చేయడానికి అంగీకరించినట్టు మోహన్‌బాబు వెల్లడించారు. త్వరలోనే ఆ సినిమా మొదలవుతున్నట్టు తెలుస్తోంది. డైలాగ్‌కింగ్‌గా ముద్రపడ్డ మోహన్‌బాబులో ఇప్పటికీ వాడి తగ్గలేదు. ఆయనకి మంచి పాత్ర దొరికితే చాలు... నటనతో సినిమాని ఎక్కడికో తీసుకెళతారు. మోహన్‌బాబు కూడా తనస్థాయికి తగ్గ కథల గురించి ఎదురు చూస్తున్నారు.
Advertisement
CJ Advs
Show comments
Advertisement
Google Ad amp 3
CJ Ads
Advertisement
Google Ad amp 3
CJ Ads