మాధవన్‌తో కోన సినిమా!
రచయిత కోన వెంకట్‌కి బోలెడంత నెట్‌వర్క్ ఉంది. అటు బాలీవుడ్ నుంచి ఇటు రీజినల్ ఇండస్ట్రీల వరకు ప్రతీ చోటా ఆయనకి స్నేహితులున్నారు. బాలీవుడ్‌లో పలువురు అగ్ర కథానాయకులతో సినిమాలు చేసేందుకు ఆమధ్య ప్లాన్ చేస్తున్నట్టు కనిపించారు. తాజాగా ఆయన మాధవన్‌తోనూ ఓ ప్రాజెక్టు చేయబోతున్నట్టు ప్రకటించాడు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలేవీ వెల్లడించలేదు కానీ... మాధవన్ పుట్టినరోజును పురస్కరించుకొని ఆయనకి విషెస్ చెబుతూ త్వరలోనే మేమిద్దరం ఓ ప్రాజెక్టు చేస్తున్నామని కోన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మాధవన్ ప్రస్తుతం బాలీవుడ్‌లో దుమ్ము రేపుతున్నాడు. ఇటీవల `తను వెడ్స్ మను రిటర్న్స్` చిత్రంతో అదరగొట్టి విజయాన్ని అందుకొన్నాడు. అలాగే మాధవన్‌కి అటు తమిళం, ఇటు తెలుగు భాషల్లోనూ మంచి మార్కెట్ ఉంది. మరి కోన, మాధవన్ కలిసి ఎక్కడ సినిమా చేస్తారన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆ సినిమా తెలుగులోనే అయితే పరిశ్రమకు అదొక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. మొత్తంగా కోన వెంకట్ ఇదివరకు పని చేయని కొత్త కొత్త కథానాయకులతో సినిమాలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. బాలకృష్ణతో ఇటీవలే `డిక్టేటర్` మొదలుపెట్టారు. ఇది కోన కథతో తెరకెక్కతున్న సినిమానే. దీని వెనక అన్నీ తానై వ్యవహరిస్తున్నారు కోన.
Advertisement
CJ Advs
Show comments
Advertisement
Google Ad amp 3
CJ Ads
Advertisement
Google Ad amp 3
CJ Ads