చెర్రీ డ్యాన్సులు ఇరగదీశాడట..!
రామ్‌చరణ్ కొత్త సినిమా సంగతులు వినిపించడం మొదలైంది. ఇటీవలే యూరప్ వెళ్లి రెండు సాంగ్స్‌ని పూర్తి చేసుకొచ్చారు. మరో రెండు మూడు రోజుల్లో హైదరాబాద్‌లో షెడ్యూల్ మొదలవుతుంది. అక్టోబరులో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడమే లక్ష్యంగా వేగంగా సినిమాని చేస్తున్నారు. చెర్రీ తాజాగా యూరప్ సంగతుల్ని ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించాడు. అక్కడ తీసిన సాంగ్స్ అదిరిపోయాయనీ... చాలా రోజులతర్వాత ఫాస్ట్ బీట్ సాంగ్స్‌కి స్టెప్పులేశాననీ... చాలా కష్టంగా అనిపించినా... ఫుల్ ఎంజాయ్ చేశానని చెప్పుకొచ్చాడు. అన్నట్టు ఈ సినిమాలో ఫైట్లకు కూడా చాలా ప్రాధాన్యముంది. ఆమధ్య బ్యాంకాక్ వెళ్లి జైకా స్టంట్స్ స్కూల్‌లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకొని వచ్చాడు చెర్రీ. ఇప్పుడు ఫాస్ట్ డ్యాన్సులంటున్నాడు. అటు ఫైట్లు, ఇటు డ్యాన్సులు చూస్తుంటే కేక పెట్టించేలా ఉన్నాడు చెర్రీ. ఈ చిత్రంలో చరణ్ సరసన రకుల్ నటించింది. శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్నారు.
Advertisement
CJ Advs
Show comments
Advertisement
Google Ad amp 3
CJ Ads
Advertisement
Google Ad amp 3
CJ Ads