Advertisement
Google Ads BL

'బాహుబలి' ఆడియో రిలీజ్ డేట్ వాయిదా..!


ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న చారిత్రాత్మక చిత్రం ‘బాహుబలి’. రాజమౌళి దర్శకత్వంలో తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఆకాశమే హద్దుగా.. అంతులేని అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమాలో హీరో, హీరోయిన్ పోస్టర్‌తో పాటు ఇతర ఆర్టిస్టుల స్టిల్స్‌ను కూడా విడుదల చేసి ఈ చిత్రంలో ప్రతి పాత్రకు ప్రాముఖ్యత వుందని రాజమౌళి చెప్పకనే చెప్పాడు. అయితే ఈ చిత్రం ఆడియో, ట్రైలర్ విడుదల మే31 న జరగనుందని చిత్ర బృందం వెల్లడించారు. కాని కొన్ని అనుకోని పరిస్థితుల వలన ఆడియో రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేసామని చిత్ర దర్శకుడు రాజమౌళి వెల్లడించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ "ఇప్పటివరకు సినిమా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాం. ఇప్పుడు ఆడియో విడుదల కూడా పోస్ట్ పోన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొదట మే30 న ప్రెస్ మీట్ నిర్వహించి 31న హైటెక్ గ్రౌండ్స్ లో ఆడియో రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. కాని ఈ కార్యక్రమానికి వచ్చే అభిమానుల సంఖ్య పెరగడంతో పోలీస్ వారు కొన్ని కండిషన్స్ పెట్టారు. ఇంతకముందు 'గోపాల గోపాల' , 'మిర్చి' , 'బాద్ షా' వంటి సినిమాల ఆడియో ఫంక్షన్ లలో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. అదే మాదిరిగా 'బాహుబలి' ఆడియో కార్యక్రమంలో జరగకూడదనే ఉద్దేశ్యంతో పోలీస్ వారు లిమిటెడ్ మెంబర్స్ ను మాత్రమే వెలుపలికి తీసుకువెళ్ళాలని చెప్పారు. రెండు సంవత్సరాలుగా ప్రభాస్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులను బయట నుంచోబెట్టడం సమంజశం కాదని భావించి ఈ కార్యక్రమాన్ని పోస్ట్ పోన్  చేస్తున్నాం. ప్రభాస్ ను ఫాన్స్ దగ్గరకి తీసుకువెళ్ళడం లేదా అభిమానులనే ప్రభాస్ దగ్గరకు తీసుకు రావడం ఈ రెండిటిలో ఏదోకటి జరుగుతుంది. చాలా కాలం తరువాత ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడని ఆడియో రిలీజ్ గ్రాండ్ గా ప్లాన్ చేసాం. ఈ సినిమాకు ఇప్పటికే చాలా హైప్ వచ్చింది. కేవలం హైప్ కోసం ఈ ఆడియో రిలీజ్ గ్రాండ్ గా ప్లాన్ చేయలేదు. ప్రభాస్ అభిమానుల కోసమే చేసాం. ఎక్కడ అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మేనేజ్ మెంట్ కరెక్ట్ అనిపిస్తుందో అక్కడే 'బాహుబలి' ఆడియో విడుదలవుతుంది. రెండురోజుల్లో ఆడియో రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసి అందరికి తెలియజేస్తాం. సినిమా రీరికార్డింగ్ 95% శాతం కంప్లీట్ అయింది. బాహుబలి మొదటి భాగం షూటింగ్ ముగిసింది. దీని నిడివి రెండు గంటల 35 నిమిషాలు ఉంటుంది. రెండో భాగం 70% షూటింగ్ కంప్లీట్ అయింది" అని చెప్పారు. 

Advertisement
CJ Advs

ప్రభాస్ మాట్లాడుతూ "ఆడియో, ట్రైలర్ రిలీజ్ అవుతుందని మేము కూడా చాలా ఎగ్జైట్ అయ్యాం. చాలా గ్రాండ్ గా చేయాలని ప్లాన్ చేసాం. కాని పోలీస్ వారు నియామల మేరకు పోస్ట్ పోన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందులో పోలీస్ వారి తప్పు కూడా ఏమి లేదు. అభిమానుల శ్రేయస్సు కోసమే వారు ఆలోచించి లిమిటెడ్ మెంబర్స్ కి మాత్రమే అనుమతి కల్పించారు. ఆడియో రిలీజ్ పోస్ట్ పోన్ చేసినందుకు  ఫాన్స్ అందరూ క్షమించాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.

శోభు యార్లగడ్డ మాట్లాడుతూ "పోస్ట్ పోన్ చేసినందుకు అందరిని క్షమాపణలు కోరుకుంటున్నాను. కాని మేము నిర్వహించే కార్యక్రమం అందరికి నచ్చుతుందని నమ్ముతున్నాం" అని చెప్పారు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs