సౌతిండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ విలన్‌గా చేస్తున్నాడా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్, బాలీవుడ్ వర్గాలు. శంకర్ దర్శకత్వంలో రూపొందునున్న ‘రోబో2’లో ఈ విశేషం చోటుచేసుకోనుంది. తమిళ, తెలుగు వెర్షన్స్‌లో రజనీకాంత్ హీరోగా నటించనుండగా, షారుక్‌ఖాన్ విలన్‌గా నటిస్తాడట. అదే బాలీవుడ్ వెర్షన్‌కు వచ్చే సరికి సీన్ రివర్స్ అవుతోందని అంటున్నారు. బాలీవుడ్ వెర్షన్‌లో షారుఖ్‌ఖాన్ హీరోగా నటించనుండగా, రజనీకాంత్ విలన్‌గా చేయనున్నాడని సమాచారం. మొత్తానికి మరోసారి భారీ ప్రయోగానికి శంకర్ సంసిద్దుడు అవుతుండటం ఈ ఇద్దరు సూపర్‌స్టార్స్ అభిమానులకు ఆనందదాయకంగా ఉండబోతోంది.