Advertisement
Google Ads BL

ఈనెల 29న సూర్య రాక్షసుడు గ్రాండ్ రిలీజ్..!


'గ‌జిని', 'య‌ముడు' చిత్రాల‌తో తెలుగులో సూప‌ర్బ్ క్రేజి హీరోగా ఇమేజ్ ని సొంతం చేసుకున్న సూర్య‌, గ్లామ‌ర‌స్ క్వీన్ న‌య‌న‌తార, ప్ర‌ణీత‌ జంట‌గా, విభిన్నమైన కథలు, కథనాలతో వ‌రుస విజ‌యాలు దక్కించుకున్న ద‌ర్శ‌కుడు వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌కుడిగా, 'యుగానికి ఒక్క‌డు', 'ఆవారా', 'య‌ముడు' 'సింగం' లాంటి స‌న్సేష‌న‌ల్ హిట్స్ అందించిన స్టూడియో గ్రీన్ నిర్మాణ సంస్ధ పై కె.ఇ.జ్ఞాన‌వేల్‌ స‌గ‌ర్వంగా స‌మ‌ర్పిస్తున్న చిత్రం రాక్ష‌సుడు. మెలోడి మాస్ట‌ర్ యువ‌న్‌శంక‌ర్ రాజా అందించిన పాటలు ఇటీవలే విడుదలై సూపర్ హిట్టయ్యాయి. ఈ చిత్రాన్ని తెలుగు లో మేధా క్రియోష‌న్స్‌ అధినేత‌లు మిరియాల రాజాబాబు(కృష్ణారెడ్డి), మిరియాల ర‌వింద‌ర్ రెడ్డి విడుద‌ల చేస్తున్నారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ సభ్యుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈనెల 29న రాక్షసుడు చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.

Advertisement
CJ Advs

ఈ సంద‌ర్బంగా నిర్మాత కె.ఇ.జ్ఞాన‌వేల్‌ మాట్లాడుతూ."సూర్య‌, న‌య‌న‌తార, ప్ర‌ణీత‌లు జంట‌గా, వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించిన చిత్రం 'రాక్ష‌సుడు' మే 29న విడుద‌ల చేస్తున్నాం. సూర్య పాత్ర చాలా డిఫ‌రెంట్ గా డిజైన్ చేశాం. తెలుగులో రాక్ష‌సుడు అనే టైటిల్ పెట్ట‌ట‌మే ఈ చిత్రం ఎంత వైవిధ్యంగా వుండ‌బోతుందో చెబుతున్నాము. తెలుగు లో సూర్య గారికి ఓ ప్ర‌త్యేకమైన ఇమేజ్ వుంది. తెలుగు లో ఆయ‌న చేసిన ప్ర‌తిచిత్రానికి భారీ ఓపెనింగ్స్ ఇస్తున్నారు. ఈ చిత్రంలో సూర్య గారు తెలుగు ప్రేక్ష‌కుల‌ని ఎంట‌ర్‌టైన్ చేస్తారు. ఇది మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ గా తెర‌కెక్కింది. సూర్య, న‌య‌న‌తార కాంబినేష‌న్ లో వ‌చ్చిన చిత్రాలు చాలా పెద్ద విజ‌యాలు సాదించాయి. తిరిగి వీరిద్ద‌రి కాంబినేష‌న్ అన‌గానే అంచ‌నాలు భారీగా వుంటాయి. అంద‌రి అంచ‌నాలు అందుకునేలా ఈచిత్రం వుంటుంది. ద‌ర్శ‌కుడు వెంక‌ట్ ప్ర‌భు చేసిన ప్ర‌తి చిత్రం కొత్త గా వుంటుంది. ఆయ‌న ఎంచుకునే కాన్సెప్ట్ లు జ‌న‌రంజ‌కంగా వుంటాయి. ఇప్పుడు రాక్ష‌సుడు చిత్రంతో మ‌రో కొత్త కాన్స్‌ప్ట్ తో వ‌స్తున్నారు. ఇది ఆయ‌న డైర‌క్ట్ చేస్తున్న ఆర‌వ చిత్రం. సంగీతంలో కొత్త ఒర‌వ‌డి క్రియోట్ చేసిన యువ‌న్‌శంక‌ర్ రాజా సంగీతాన్ని అందిచారు. సెన్సార్ సభ్యులు కూడా అద్భుతమైన చిత్రాన్ని రూపొందించారని మెచ్చుకోవడం చాలా సంతోషాన్నిచ్చింది " అని అన్నారు

తెలుగు వెర్ష‌న్ పంపిణీదారులు మేధా క్రియోష‌న్స్ అధినేతల్లో ఒక‌రు మిరియాల కృష్ణారెడ్డి మాట్లాడుతూ" సూర్య గారు న‌టించిన 'రాక్ష‌సుడు' చిత్రం తెలుగు వెర్ష‌న్ ని మాకు ఇచ్చిన కె.ఇ.జ్ఞాన‌వేల్‌ గారికి మా ప్ర‌త్యేక ధన్య‌వాదాలు. ఈ చిత్రం మేధా రిలీజ్ ద్వారా విడుద‌ల చేస్తున్నాం. సినిమా సూప‌ర్బ్ గా వుంటుంది. న‌య‌న‌తార‌, ప్ర‌ణీత లు హీరోయిన్స్ గా న‌టిస్తున్నారు. సెన్సార్ కార్యక్రమాలు ఈరోజే పూర్తయ్యాయి. సెన్సార్ సభ్యుల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్య‌క్ర‌మాలు కంప్లీట్ చేసి మే 29న చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నాం." అని అన్నారు. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs