Advertisement
Google Ads BL

ప‌వ‌న్‌కోసం... పుణె ద‌గ్గ‌ర‌!


గుబురు గెడ్డంతో బాబాని త‌ల‌పించేలా కనిపిస్తున్న ప‌వ‌న్‌క‌ళ్యాణ్ త్వ‌ర‌లోనే క్లీన్‌గా షేవ్ చేసి పోలీస్ గెట‌ప్‌లోకి మార‌బోతున్నారు. అందుకు కార‌ణం... `గ‌బ్బ‌ర్‌సింగ్‌2` సినిమా. ప‌వ‌న్‌క‌ల్యాణ్ క‌థానాయ‌కుడిగా న‌టించనున్న `గ‌బ్బ‌ర్‌సింగ్‌2` ఈ నెల 29నుంచి సెట్స్‌పైకి వెళ్ల‌బోతోంది. ఆ మేర‌కు పుణె ద‌గ్గ‌ర ఒక చిన్న ప‌ల్లెటూళ్లో సెట్స్ వేసి చిత్రీక‌ర‌ణ‌కి ఏర్పాట్లు చేశారు. జూన్ 15 వ‌ర‌కు అక్క‌డే తొలి షెడ్యూల్ జ‌రుపుతార‌ని స‌మాచారం. `ప‌వ‌ర్‌` ఫేమ్ బాబీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కనున్న `గ‌బ్బ‌ర్‌సింగ్‌2` కోసం రెండేళ్లుగా స్ర్కిప్ట్ ప‌నులు జ‌రిగాయి. ఆ ప‌నులు ఇటీవ‌ల కొలిక్కి రావ‌డంతో చిత్రీక‌ర‌ణ మొద‌లుపెట్టేందుకు ఏర్పాట్లు చేసుకొన్నారు. ప‌వ‌న్‌కూడా  సినిమా చిత్రీక‌ర‌ణ‌కి పుణెనే ప్రిఫ‌ర్ చేశాడ‌ట‌. ఫుణెలో రేణుదేశాయ్ ద‌గ్గ‌రున్న త‌న పిల్ల‌లతో గ‌డిపే అవ‌కాశం కూడా ఉంటుంది కాబ‌ట్టి అక్క‌డే చిత్రీక‌ర‌ణకి ఏర్పాట్లు చేయ‌మ‌ని చెప్పాడ‌ట‌. ఈ చిత్రంలో ప‌వ‌న్ స‌ర‌స‌న అనీషా ఆంబ్రోస్ న‌టిస్తోంది. శ‌ర‌త్ మ‌రార్ నిర్మాత‌. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs