వయసు ఫిఫ్టీ ప్లస్. కానీ ఆయన దూకుడు మాత్రం కుర్రాళ్లను తలపిస్తోంది. సినిమానే ధ్యాసగా, సినిమానే శ్వాసగా భావించే కమల్‌హాసన్ ఇటీవల ఒకేసారి రెండు మూడు చిత్రాలు చేస్తూ బాక్సాఫీసు దగ్గర సందడి చేస్తున్నాడు. మొన్ననే ‘ఉత్తమ విలన్’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పుడు మరో రెండు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అప్పుడే మళ్లీ కొత్త సినిమాకి పచ్చజెండా ఊపాడు కమల్. తెలుగు,తమిళ భాషల్లో రాజేష్ దర్శకత్వంలో ఓ చిత్రం చేసేందుకు అంగీకరించారు. తమిళంలో ‘తూంగావనం’ పేరుతో రూపొందుతున్న ఆ చిత్రం తెలుగులో ‘చీకటి రాజ్యం’గా తెరకెక్కుతోంది. ఇందులో కమల్ సరసన త్రిష నటిస్తోంది. ఆదివారం హైదరాబాద్‌లో సినిమా చిత్రీకరణ మొదలైంది.