మహేష్ కోసమే ఆ పాత్ర సృష్టించారా?
సుధీర్‌బాబు సినిమాలో తన బావ మహేష్ కనిపించబోతున్నాడన్న వార్త చాలా రోజులుగా వినిపిస్తోంది. `కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ` చిత్రంలోనే మహేష్ నటిస్తున్నాడని అప్పట్లో ప్రచారం సాగింది. కానీ ఏవో రెండు టిక్కెట్లు అదనంగా తెగాలని తన బావని వాడుకోవడం ఇష్టం లేక సుధీర్‌బాబే వద్దన్నారట. అయితే అవసరమైనప్పుడు మాత్రం తాను తప్పకుండా నటిస్తానని సుధీర్‌కి మహేష్ మాటిచ్చారట. ఆ కథకు తన అవసరం బలంగా ఉండాలని చిన్న షరతు పెట్టాడట. అందుకే `మోసగాళ్లకు మోసగాడు`లో తన బావకోసం ఓ మంచి క్యారెక్టర్ డిజైన్ చేయించుకొన్నాడు సుధీర్. పతాక సన్నివేశాల్లో ''ఈ పని మా బావకు అప్పగించా..'' అంటాడు. బావ అనగానే అందరూ 'మహేష్ బాబు వచ్చేస్తాడు..' అనుకొన్నారు. కానీ ఆ ప్లేసులో మనోజ్ వచ్చాడు. నిజానికి మహేష్ కోసం సృష్టించిన పాత్ర అది. బిల్బప్ కూడా భారీగా ఇచ్చారు. చిన్న పాత్రే అయినా మనోజ్ చేసిన సందడి బాగానే ఉంది. నిజానికి మహేష్ కూడా ఈ పాత్రలో నటించాలని అనుకొన్నాడట. కానీ సుధీర్‌బాబే మళ్లీ వద్దనుకొన్నాడు. తనకి ఇష్టమైన పుల్లెల గోపీచంద్ సినిమాలో నటించేద్దువు అని చెప్పి ఈసారికి మనోజ్‌తో సరిపెట్టాడట. ఒకవేళ మనోజ్ ప్లేసులోని మహేష్ కనిపించుంటే `మోసగాళ్లకు మోసగాడు` సినిమాకి మంచి క్రేజే లభించేదని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
Advertisement
CJ Advs
Show comments
Advertisement
Google Ad amp 3
CJ Ads
Advertisement
Google Ad amp 3
CJ Ads