కోటి పలికిన `బాహుబలి` ఆడియో టెలికాస్ట్ రైట్స్
బిజినెస్ పరంగా `బాహుబలి` సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే ఏ ఏరియాకి ఆ ఏరియా హయ్యస్ట్ రేట్స్‌కి అమ్ముడైంది సినిమా. తాజాగా ఆడియో పరంగా కూడా `బాహుబలి` రికార్డులు తిరగరాస్తోంది. ఈ నెల 31న హైదరాబాద్‌లో భారీ స్థాయిలో జరగనున్న ఆడియో వేడుకని టెలిక్యాస్ట్ చేసేందుకు టెలివిజన్ ఛానళ్లు పోటీపడ్డాయి. చివరికి టీవీ 5 ఛానల్ కోటి రూపాయలకి రైట్స్‌ని చేజిక్కించుకొంది. ఆడియో వేడుక టెలిక్యాస్ట్ రైట్స్ ఇంత భారీ ధర పలకడం తెలుగు చలన చిత్ర చరిత్రలో ఇదే తొలిసారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన `బాహుబలి`పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆడియో విడుదల వేడుక రోజునే ట్రయిలర్‌ని విడుదల చేస్తారు. ట్రయిలర్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఆ క్రేజ్ రీత్యానే టీవీ 5 ఛానల్ కోటి రూపాయలు పెట్టి హక్కుల్ని సొంతం చేసుకొంది.
Advertisement
CJ Advs
Show comments
Advertisement
Google Ad amp 3
CJ Ads
Advertisement
Google Ad amp 3
CJ Ads