అయనో నట ప్రభంజనం..ఆయన ప్రతి సినిమా విలక్షణతకి చిరునామా. అందుకే చెక్కు చెదరని అభిమానగణం ఆయన సొంతం... దటీజ్ నటసింహ నందమూరి బాలకృష్ణ. ఇటీవలి కాలంలో సింహా, లెజెండ్, లయన్ వంటి వరుస విజయాలతో బాక్సాఫీస్ బొనాంజాగా కలెక్షన్ల సునామీని సృష్టించిన ఈ నందమూరి అందగాడు తన నటనతో వెండితెరపై చెరగని ముద్రవేశారు. ఆయన ప్రతి సినిమా డిఫరెంట్‌గా ఉండి అభిమానులనే కాదు, అన్నీ వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది. ఆయనతో సినిమా చేయాలని ప్రతి దర్శకుడు, నిర్మాత ఎదురుచూస్తారు. ఆయన సినిమా వస్తుందంటే ఇండస్ట్రీ వర్గాల్లో కూడా అమితాసక్తి నెలకొని ఉంటుంది. అందుకు ప్రత్యేకించి కారణాలను వెతనక్కర్లేదు. వెర్సటైల్ కథలను ఎంచుకోవడమే కాదు పాత్రకి తగిన విధంగా ఆయన తనని తాను మలుచుకుంటారు. అందుకు తగిన విధంగా ఆయన వ్యావహారిక శైలి ప్రతిబింబిస్తుంది. ఆహార్యం, వేషధారణల్లో మార్పును ప్రస్పుటంగా కనిపించేలా నట సింహం కృషి చేస్తారు. అందుకే తిరుగులేని రికార్డులతో వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు నందమూరి నటసింహం.
ఇప్పుడు ఇండస్ట్రీ దృష్టి అంతా బాలకృష్ణ చేయబోయే 99వ సినిమాపై ఉంది. ఈ సినిమాలో బాలకృష్ణ లుక్ ఎలా ఉంటుంది? ఎలాంటి కథతో అభిమానులను, ప్రేక్షకులను అలరిస్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లక్ష్యం, రామరామ కృష్ణ కృష్ణ, పాండవులు పాండవులు తుమ్మెద, లౌక్యం వంటి కమర్షియల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్‌తో అలరించిన వెర్సటైల్ దర్శకుడు శ్రీవాస్ ఈ ప్రెస్జీజియస్ మూవీని డైరెక్ట్ చేయనున్నారు. బాలకృష్ణను సరికొత్తగా ప్రజెంట్ చేయనున్నారు. ఇండియాలో టాప్ మోస్ట్ ప్రొడక్షన్ హౌస్ ఈరోస్ ఇంటర్నేషనల్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ సందర్భంగా ...
నటసింహ నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ ‘‘నా 99వ సినిమా డిక్టేటర్ ని ఈ నెల 29న ప్రారంభించనున్నాం. డైరెక్టర్ శ్రీవాస్ నా దగ్గరకు ఒక మంచి కథతో వచ్చాడు. ఈ సినిమాని ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించనుంది. వారితో పనిచేయడం హ్యపీగా ఉంది. కథ విషయంలో నేను హండ్రెడ్ పర్సెంట్ కొత్తదన్నాన్ని ఫీలవుతున్నాను. ఈమధ్యనే ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ లుల్లాగారు, డైరెక్టర్ శ్రీవాస్, నేను కలిసి ఈ సినిమాకి సంబంధించి మాట్లాడుకున్నాం. కోనవెంకట్, గోపిమోహన్‌లు అన్నీ ఎలిమెంట్స్ ఉన్న మంచి కథను అందించారు. రత్నం, శ్రీధర్ సీపానలు కూడా ఈ సినిమాకి పనిచేస్తున్నారు. ఈ సినిమాకి ఒక ఫ్రెష్ టీమ్‌తో కలిసి పనిచేస్తున్నాను. ఒక ఫ్రెష్ ఫీల్ ఇస్తున్న సినిమా. యాక్షన్, ఫ్యామిలీ, ఎమోషన్స్, ఎంటర్‌టైన్ మెంట్ అన్నీ ఎలిమెంట్స్‌తో యూనిక్ కాన్సెప్ట్‌తో రూపొందనున్న ఈ సినిమా తప్పకుండా నచ్చే చిత్రమవుతుంది’’అన్నారు.
ఈరోస్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ లుల్లా మాట్లాడుతూ ‘‘నందమూరి బాలకృష్ణ 99వ చిత్రం ‘డిక్టేటర్’ గురించి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలుసు. ఈ సినిమా గురించి ఈ మధ్యనే నేను బాలకృష్ణగారికి కలిశాను. ఆయన కథ గురించి హండ్రెడ్ పర్సెంట్ హ్యపీగా ఉన్నారు. సౌత్ ఇండస్ట్రీలో బాలకృష్ణ వంటి స్టార్ హీరో సినిమాతో తొలిసారిగా ఫుల్ టైమ్ ప్రొడక్షన్ చేస్తున్నాం. ఎన్నో కమర్షియల్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్‌ను అందించి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన యంగ్ డైరెక్టర్ శ్రీవాస్ దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నాం. శ్రీవాస్ చెప్పిన కథ మాకు బాగా నచ్చింది. అభిమానులు, ప్రేక్షకులు ఆయన్ను ఎలా చూడాలనుకుంటారో అలాంటి ఒక మంచి కథతో ఈ సినిమా రూపొందనుంది. మా సంస్థ వేదాశ్వ క్రియేషన్స్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. శ్రీవాస్ డైరెక్షన్ చేయడంతో పాటు ఈ సినిమాకి కోప్రొడ్యూస్ చేయడం వల్ల సినిమా పక్కా ప్లానింగ్‌తో సాగుతుంది. శ్రీవాస్ ప్లానింగ్‌తో సినిమాని గ్రాండ్‌లెవల్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రూపొందిస్తాం. శ్రీవాస్‌గారు సినిమాకి అవసరమైన విషయాలన్నీ తానై దగ్గరుండి చూసుకుంటున్నారు. ఆయనతో కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాకి ఒక ఫ్రెష్ టీమ్ పనిచేస్తుంది. చాలా ఫ్రెష్ స్టోరి. యాక్షన్, ఎమోషనల్, డ్రామా, ఇలా అన్నీ ఎలిమెంట్స్ ఉన్న సరికొత్త సబ్జెక్ట్. ఈ సినిమాని ఈ నెల 29న లాంఛ్ చేయనున్నాం. నందమూరి అభిమానులను, తెలుగు ప్రేక్షకులను అలరించే చిత్రమవుతుందని గ్యారంటీగా చెప్పగలను’’ అన్నారు.
చిత్ర దర్శకుడు, సహనిర్మాత శ్రీవాస్ మాట్లాడుతూ ‘‘బాలయ్యబాబుతో పనిచేయడం ఆనందంగా ఉంది. చాలా రోజుల నుండి ఆయనతో కలిసి పనిచేయాలనుకుంటున్నాను. ఈ సినిమాతో కుదిరింది. అలాగే ఈరోస్ సంస్థ సౌత్‌లో ప్రొడ్యూస్ చేస్తున్న తొలి సినిమా ఇదే కావడం, ఇటువంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌లో మా వేదాశ్వ క్రియేషన్స్ బ్యానర్‌తో నేను కోప్రొడ్యూసర్‌గా పార్ట్ కావడం మరచిపోలేని అనుభూతినిస్తుంది. ఎంతో హ్యపీగా ఫీలవుతున్నాను. బాలయ్యబాబు సపోర్ట్‌తో నేను నిర్మాతగా మారాను. బాలయ్యబాబను ఆయన అభిమానులు, ప్రేక్షకులు ఇప్పటి వరకు చూడని విధంగా డిఫరెంట్‌గా ప్రజెంట్ చేస్తున్నాం. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు. శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రఫీ, ఫైట్స్‌ను రవివర్మ, ఆర్ట్‌ను బ్రహ్మకడలి, గౌతంరాజు ఎడిటింగ్‌ను అందిస్తున్నారు. ఇలా ఈ సినిమాకి అంతా ఒక ఫ్రెష్ టీమ్ పనిచేస్తుంది. అంజలి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించనుంది. మరో హీరోయిన్ వివరాలను త్వరలోనే తెలియజేస్తాం.ఈ నెల 29న సినిమా లాంఛ్ కానుంది. అన్నీ ఎలిమెంట్స్ సమపాళ్లలో కూడుకున్న ఎంటర్‌టైనర్’’ అన్నారు.
నటీనటులు: నందమూరి బాలకృష్ణ, అంజలి, నాజర్, బ్రహ్మానందం, రవికిషన్, కబీర్, వెన్నెల కిషోర్, పృథ్వి, కాశీ విశ్వనాధ్, సుప్రీత్, అమిత్.
సాంకేతిక నిపుణులు: ప్రొడ్యూసర్: ఎరోస్ ఇంటర్నేషనల్, డైరెక్టర్-కో ప్రొడ్యూసర్: శ్రీవాస్, కథ-స్క్రీన్ ప్లే: కోన వెంకట్, గోపీమోహన్, మాటలు: ఎం.రత్నం, రచన: శ్రీధర్ శ్రీపాన, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు, మ్యూజిక్: తమన్ ఎస్.ఎస్, ఎడిటర్: గౌతంరాజు, ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి, ఫైట్స్: రవి వర్మ
Advertisement
CJ Advs