Advertisement
Google Ads BL

'బందూక్' సినిమా పాటల విడుదల..!


బి.బి.ఎన్,స్టూడియో మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై లక్ష్మణ్ మురారి దర్శకత్వంలో గుజ్జ యుగంధర్ రావు పూర్తి తెలంగాణ కళాకారులు, సాంకేతిక నిపుణులతో నిర్మించిన సినిమా ‘బందూక్‌’. కార్తిక్ కొడకండ్ల సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో విడుదల శుక్రవారం హైదరాబాద్ లో పలువురు సినీ, రాజకీయనాయకుల సమక్షంలో వైభవంగా జరిగింది. రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రి ఈటెల రాజేందర్ చిత్ర టీజర్ ను, ఆడియోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ "ఈ సినిమాకు సంబంధించిన 24 క్రాఫ్ట్ లలో తెలంగాణా కళాకారులే పని చేయడం గొప్ప విషయం. తెలంగాణా సమాజం నుండి ఇప్పటికే గొప్ప గొప్ప కవులొచ్చారు. ఈ సినిమాలో నటించిన నటీనటులు భవిష్యత్తులో చిచ్చరపిడుగులవుతారు. తెలంగాణా ప్రభుత్వం ఈ చిత్ర బృందానికి పూర్తిగా అండగా నిలుస్తుంది. సినీ రంగంలో మనకు అవమానాలు జరిగినా అవి ఆశీర్వాదాలు కావాలి. మనలో కసిని పెంచాలి. ఈరోజు ఈ గడ్డ బిడ్డలుగా 'బందూక్'లో నటించిన కళాకారులు సినీ రంగంలో ఎదుగుతారని ఆశిస్తున్నాను" అని అన్నారు.

Advertisement
CJ Advs

నిర్మాత గుజ్జ యుగంధర్ రావు మాట్లాడుతూ "శాంతియుతంగా ఇంత పెద్ద తెలంగాణాను ఈరోజు ఎలా సాధించుకున్నాం అనే ముఖ్య ఉద్దేశ్యంతో చేసిన సినిమానే 'బందూక్'. గోరటి వెంకన్న గారితో పది జిల్లాల ప్రాముఖ్యతను వర్ణిస్తూ ఓ బ్రీత్ లెస్ సాంగ్ ను రాయించాం. 2001 నుండి తెలంగాణా సాధించే వరకు ఎలాంటి ఉద్యమాలు జరిగాయో వాటన్నింటినీ సీక్వెల్స్ గా పెట్టి రాబోయే తరాలకు తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమా తీసాం" అని అన్నారు.

ఎన్.శంకర్ మాట్లాడుతూ "ఈ సినిమా ఓ మంచి ప్రయత్నం. ఈ చిత్రం కోసం గోరటి వెంకన్న గారు రాసిన పాట సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్తుంది. ఈ సినిమాను నిర్మించిన చిత్ర బృందాన్ని అందరు ఆశీర్వదించాలి" అని అన్నారు.

లక్ష్మణ్ మురారి మాట్లాడుతూ "బందూక్ ఆత్మ విమర్శ చేసుకొనే కొత్త కథనంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. బందూక్ లేకుండా చరిత్రలో రెండు గొప్ప విజయాలు సిద్ధించాయి. భారత దేశానికి గాంధీజీ నేతృత్వంలో అహింసా మార్గంలో స్వాతంత్రం సిద్ధించడం ఒకటయితే ఒక నెత్తురు బొట్టు చిందించకుండా కెసిఆర్ న్యాయకత్వంలో తెలంగాణా రాష్ట్రాన్ని సాధించుకోవడం మరొకటి. దీన్నే బందూక్ లో చూపిస్తున్నాం" అని అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో దేశపతి శ్రీనివాస్, జితేందర్ రెడ్డి, విజయేందర్ రెడ్డి, వేణుగోపాల చారి, కార్తిక్ కొడకొండ్ల, మిథున్ రెడ్డి, చైతన్య, మధు, శహెరా భాను, రమేష్ హజారే, కో డైరెక్టర్ రమేష్, అభిజీత్ తదితరులు పాల్గొన్నారు. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs