ప్రభాస్ సందడి మొదలవుతోంది. `బాహుబలి` గెటప్‌లో ఉన్న ఆయన పోస్టర్‌ని రేపు విడుదల చేయబోతున్నారు. ఈ నెల 31న పాటలు విడుదల కాబోతున్నాయి. ఆ వేడుకని హైదరాబాద్‌లో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లూ జరుగుతున్నాయి. లహరి మ్యూజిక్ సంస్థ ఆడియో రైట్స్‌ని చేజిక్కించుకొంది. తెలుగుతోపాటు, తమిళంలోనూ అదే కంపెనీ `బాహుబలి` ఆడియోని విడుదల చేస్తోంది. తాజాగా ఫస్ట్‌పార్ట్‌లో 8 పాటలుంటాయన్న విషయాన్ని సంగీత దర్శకుడు కీరవాణి బయటపెట్టారు. శివశక్తి దత్తా, చైతన్యప్రసాద్, రామజోగయ్యశాస్త్రి, అనంతశ్రీరామ్, నోయల్ సియాన్, ఇనగంటి సుందర్, ఆదిత్య తొలి భాగం సినిమాకి పాటలు రాశారు. జులై 10న తొలి భాగం `బాహుబలి - ది బిగినింగ్` పేరుతో విడుదలవుతోంది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 3500కిపైగా థియేటర్లలో విడుదలవుతున్నట్టు తెలుస్తోంది.
Advertisement
CJ Advs