‘అలా ఎలా’ చిత్రంతో విజయాన్ని అందుకున్న యువ కథానాయకుడు రాహుల్ రవీంద్రన్ నటిస్తున్న తాజా చిత్రం ‘హైదరాబాద్ లవ్‌స్టోరి’.రేష్మి మీనన్, జియా నాయికలు. ఎస్.ఎన్.ఆర్ ఫిల్మ్ ఇండియా ప్రవైట్ లిమిటెడ్ పతాకంపై పద్మజ.ఎస్ సమర్పణలో ఎస్.ఎన్.డ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజ్ సత్య దర్శకుడు. అన్ని పనులను పూర్తిచేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.కాగా ఈ చిత్రం సెన్సారు బుధవారం పూర్తిచేసుకుంది. యుబైఏ సర్టిఫికెట్ లభించింది. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలను తెలియజేస్తూ ‘ హైదరాబాద్ నేపథ్యంలో నడిచే అందమైన ప్రేమకథ ఇది. హైదరాబాద్ సంస్కృతి, యాస, వేషధారణ, హైదరాబాద్ ప్రజల అభిరుచులు ఇలా పలు అంశాలను ఈ చిత్రంలో చూపించబోతున్నాం.రొమాన్స్, ఎమోషన్స్, ఫాంటసీ అంశాల కలయికలో పూర్తి వినోదాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం వుంది’ అన్నారు. నిర్మాత ఎస్.ఎన్.డ్డి మాట్లాడుతూ ‘ సరికొత్త ప్రేమకథగా రూపొందిన ఈ చిత్రం కూడా అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందనే నమ్మకం వుంది. ముఖ్యంగా యువతను అలరించే అంశాలు ఇందులో పుష్కలంగా వున్నాయి. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని తెలిపారు. రావు రమేష్, తాగుబోతు రమేష్, అంబటి, చంటి, రమాప్రభ, మధుమణి తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కాశ్యప్, కెమెరా: బీవీ అమర్‌నాథ్ రెడ్డి, ఎడిటర్:ఎం.ఆర్.వర్మ, సమర్పణ: పద్మజ.ఎస్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రాజేందర్ రెడ్డి పిన్నింటి, సహ నిర్మాత: ఎస్.శ్రీలక్ష్మి, రచన-దర్శకత్వం: రాజ్‌సత్య