Advertisement
Google Ads BL

అక్కడ బ్లాక్‌బస్టరే.. మరి ఇక్కడ.!


తమిళ ఇండస్ట్రీలో అజిత్‌కి వున్న ఫాలోయింగ్‌ గురించి అందరికీ తెలిసిందే. లేటెస్ట్‌గా గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో చేసిన ‘ఎన్నయ్‌ అరిందాల్‌’ చిత్రం తమిళ్‌లో విడుదలై బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని నిర్మించిన ఎ.ఎం.రత్నం తెలుగులో ‘ఎంతవాడుగానీ..’ పేరుతో రిలీజ్‌ చేస్తున్నారు. ‘కాక కాక’ చిత్రంతో హీరో సూర్యను స్టార్‌ హీరోని చేసిన గౌతమ్‌ మీనన్‌ ఈ చిత్రాన్ని ఆ రేంజ్‌లోనే తెరకెక్కించాడు. ‘కాక కాక’ తర్వాత కమల్‌హాసన్‌ హీరోగా, జ్యోతిక హీరోయిన్‌గా గౌతమ్‌ మీనన్‌ రూపొందించిన ‘వేట్టైయాడు వెలయాడు’ చిత్రం కూడా తమిళ్‌లో పెద్ద హిట్‌ అయింది. ‘రాఘవన్‌’గా విడుదలైన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు అంతగా ఆదరించలేదు. అయితే అజిత్‌తో గౌతమ్‌ మీనన్‌ రూపొందించిన ‘ఎంతవాడుగానీ’ చిత్రం ‘కాక కాక’, ‘వేట్టైయాడు వెలయాడు’ చిత్రాల కలబోతగా వుంటుందట. అయినప్పటికీ తమిళ్‌లో ఈ చిత్రానికి ఘనవిజయం అందించారు అక్కడి ప్రేక్షకులు. ఈ నెల 22న తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘ఎంతవాడుగానీ’ చిత్రం ఏమేర తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs