సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో నందు, అనైక సోఠి జంటగా డి.వి. క్రియేషన్స్ పతాకంపై డి.వెంకటేష్ నిర్మిస్తున్న చిత్రం '365 days'. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో రిసెప్షన్ ను ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ "ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్న తరువాత వారి జీవితాలు, వారి ఆలోచనలు ఎలా మార్పు చెందాయో ఈ సినిమాలో చూపిస్తున్నాను. ఇందులో ప్రేక్షకుడు ఆ ఇద్దరి మధ్య ఉన్నట్లుగా ఫీల్ పొందుతాడు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో టెన్షన్ క్రియేట్ చేయడానికి ట్రై చేసాను. ఇదొక రొమాంటిక్ ఫిలిం అయినప్పటికీ థ్రిల్లర్ నేపధ్యంలో చేసాం" అని అన్నారు.
అనైక సోతి మాట్లాడుతూ "ఈ సినిమా మే 22న విడుదల కానుంది. సినిమా ఓ డిఫరెంట్ ఫీల్ ను ఇచ్చింది. చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను" అని అన్నారు.
నిర్మాత డి.వెంకటేష్ మాట్లాడుతూ "ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా ఇది. ఈ సినిమాలో రొమాన్సే కాదు ఎమోషన్స్ కూడా ఉన్నాయి. అందరికి డిఫరెంట్ ఫీల్ ను కలిగించే సినిమా ఇది" అని అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో సిరాశ్రీ, కృష్ణుడు, రఘుకులకర్ణి, అన్వర్ అలీ, శేషు, ఎల్.ఎం.ప్రేమ్, కె.ఎం.ఆర్, నాగ శ్రీవత్స తదితరులు పాల్గొన్నారు.