Advertisement
Google Ads BL

ప్రభాస్‌ స్పెషల్‌ గెస్ట్‌గా ‘రాక్షసుడు’ ఆడియో..!


సూర్య హీరోగా కె.ఇ.జ్ఞానవేల్‌రాజా సమర్పణలో స్ట్టూడియో గ్రీన్‌ పతాకంపై వెంకట్‌ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘రాక్షసుడు’. ఈ చిత్రాన్ని మేథ క్రియేషన్స్‌ బేనర్‌పై కృష్ణారెడ్డి, రవీందర్‌రెడ్డి తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో సూర్య సరసన నయనతార, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ మే 18న హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో పలువురు సినీ ప్రముఖులు, అభిమానుల నడుమ వైభవంగా జరిగింది. ఈ ఆడియో ఆవిష్కరణకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ బిగ్‌ సీడీని ఆవిష్కరించగా, ఆడియో సీడీలను హీరో సూర్య ఆవిష్కరించి తొలి సి.డి.ని ప్రభాస్‌కి అందించారు. యువన్‌ శంకర్‌రాజా సంగీత సారధ్యంలో రూపొందిన ఈ చిత్రం ఆడియో ఈరోస్‌ మ్యూజిక్‌ ద్వారా మార్కెట్‌లోకి విడుదలైంది. 
ఇంకా ఈ కార్యక్రమంలో ఎ.కోదండరామిరెడ్డి, 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సి.ఇ.ఓ రాజశేఖర్‌, డైరెక్టర్‌ వెంకట్‌ ప్రభు, సంగీత దర్శకుడు యువన్‌ శంకర్‌ రాజా, నిర్మాత కాశీ విశ్వనాథ్‌, బన్నివాసు, మాజీ డి.జి.పి.దినేష్‌ రెడ్డి, ఏషియన్‌ ఫిలింస్‌ సునీల్‌ నారంగ్‌, మల్టీ డైమన్షన్‌ వాసు, జ్ఞానవేవల్‌ రాజా, ప్రేమ్‌ జీ, శ్రీమాన్‌, ఎడిటర్‌  ప్రవీణ్‌, శశాంక్‌ వెన్నెలకంటి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా....
హీరో సూర్య మాట్లాడుతూ ‘‘కోదండరామిరెడ్డిగారి దర్శకత్వంలో రూపొందిన ‘రాక్షసుడు’ టైటిల్‌ మా సినిమాకి పెట్టుకోవడం చాలా హ్యాపీగా వుంది. మా సినిమా షూటింగ్‌ జరుగుతున్నప్పుడే బాహుబలి షూటింగ్‌ కూడా జరుగుతోంది. అప్పుడు ప్రభాస్‌తో చాలా టైమ్‌ స్పెండ్‌ చేయడం జరిగింది. రానా కూడా నాకు మంచి ఫ్రెండ్‌. వీరంతా కలిసి చేసిన బాహుబలి చిత్రం కోసం తమిళ ఇండస్ట్రీ వెయిట్‌ చేస్తోంది. ఇక రాక్షసుడు గురించి చెప్పాలంటే ఒక కొత్త ఐడియాతో వెంకట్‌ప్రభుగారు ఈ సినిమాని చేశారు. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది. ఈ సినిమాని తెలుగులో రిలీజ్‌ చేస్తున్న కృష్ణారెడ్డిగారికి, రవీందర్‌రెడ్డిగారికి థాంక్స్‌. మే 29న ఈ చిత్రం మీ ముందుకు వస్తోంది. తప్పకుండా మా చిత్రాన్ని ఆదరిస్తారని నమ్ముతున్నాను’’ అన్నారు. 
యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ మాట్లాడుతూ ‘‘తమిళ ఇండస్ట్రీలో జ్ఞానవేల్‌రాజాగారు చాలా పెద్ద ప్రొడ్యూసర్‌. ఆయన కాంబినేషన్‌లోనే బాహుబలి తమిళ్‌లో చేస్తున్నాము. ఆయన బేనర్‌లో వస్తున్న ‘రాక్షసుడు’ చాలా మంచి సినిమా అవుతుంది. వెంకట్‌ప్రభుగారు చాలా మంచి డైరెక్టర్‌. ఈ చిత్రానికి యువన్‌శంకర్‌రాజా చాలా మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. సూర్యగారి గురించి చెప్పాలంటే ఆయన కళ్ళంటే నాకు ఇష్టం. కళ్ళతోనే అద్భుతంగా నటించగలరు. ఆయన హీరోగా చేసిన ‘కాక కాక’ సినిమా అంటే నాకు బాగా ఇష్టం. ఒక మంచి కాంబినేషన్‌లో వస్తోన్న ‘రాక్షసుడు’ చిత్రం తప్పకుండా తెలుగులో కూడా పెద్ద హిట్‌ అవుతుందని ఆశిస్తున్నాను’’ అన్నారు. 
చిత్ర నిర్మాతలు కృష్ణారెడ్డి, రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ ‘‘ఈ సినిమాని మేం తెలుగులో అందించడంలో జ్ఞానవేల్‌రాజాగారి కృషి ఎంతో వుంది. ఆయన ప్రోత్సాహంతోనే ఈ చిత్రాన్ని మేం చేయగలుగుతున్నాం. ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఆయనకి థాంక్స్‌ చెప్తున్నాము’’ అన్నారు. దర్శకుడు వెంకట్‌ప్రభు మాట్లాడుతూ ‘‘సూర్య కాంబినేషన్‌లో చేసిన ఈ సినిమా ఈనెల 29న మీ ముందుకు వస్తోంది. ఈ సినిమాని తప్పకుండా ఆదరిస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు. 
ఎ.కోదండరామిరెడ్డి మాట్లాడుతూ ‘‘చిరంజీవితో 1986 అక్టోబర్‌లో ‘రాక్షసుడు’ స్టార్ట్‌ చేశాను. అలాగే కమల్‌హాసన్‌, శ్రీదేవితో ‘ఒకరాధ ఇద్దరు కృష్ణులు’ సినిమా చేశాను. ఆ రెండు సినిమాలు ఒకేరోజు రిలీజ్‌ అయి పెద్ద హిట్‌ అయ్యాయి. ఇప్పుడు ‘రాక్షసుడు’ టైటిల్‌తో సూర్య చేస్తున్న ఈ సినిమా సమ్మర్‌ స్పెషల్‌గా ఈనెల 29న రిలీజ్‌ అవుతోంది. ఆ రాక్షసుడు సినిమాకి ఇళయరాజాగారు సంగీతం అందిస్తే, ఈ రాక్షసుడు చిత్రానికి ఆయన తనయుడు యువన్‌ శంకర్‌రాజా మ్యూజిక్‌ చేశాడు. ఈ టీజర్‌ చూసిన తర్వాత సినిమా తప్పకుండా పెద్ద హిట్‌ అవుతుందన్న నమ్మకం నాకు కలిగింది. ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరికీ ఆల్‌ ది బెస్ట్‌ చెప్తున్నాను’’ అన్నారు. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs