అక్కినేని అభిమానుల కళ్లన్నీ ఇప్పుడు అఖిల్‌మీదే ఉన్నాయి. సిసింద్రీగా ఊహ తెలియని వయసులోనే అదరగొట్టిన అఖిల్ ఇక కథానాయకుడిగా కూడా దుమ్ము దులిపేస్తాడని అంచనా వేస్తున్నారు. వినాయక్ దర్శకత్వంలో సినిమా మొదలయ్యేసరికి ఆ అంచనాలు మరింతగా పెరిగాయి. ఇప్పుడు అఖిల్ చెబుతున్న ముచ్చట్లతో అభిమానులు ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అన్న ఆత్రుతని కనబరుస్తున్నారు.
అఖిల్ చిత్రం ప్రస్తుతం స్పెయిన్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. అక్కడ కొన్ని యాక్షన్ సన్నివేశాలతో పాటు, పాటల్ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేశారు. నాలుగైదు రోజులుగా విజయన్ నేతృత్వంలో పోరాట ఘట్టాల్ని తెరకెక్కిస్తున్నారు. ఆ ఫైట్ గురించి తాజాగా మరోసారి ట్వీట్ చేశాడు అఖిల్. మా దర్శకుడు చాలా వేగంతో సినిమాని తీస్తున్నాడనీ, ఫైట్ మాస్టర్ విజయన్ నేతృత్వంలో తెరకెక్కుతున్న పోరాటఘట్టం ప్రత్యేకంగా నిలవబోతోందని, అందుకు సంబంధించిన ఫొటోని త్వరలోనే ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తానని చెప్పుకొచ్చాడు అఖిల్. నేడు అఖిల్ ఫొటో బయటికి వచ్చే అవకాశాలున్నాయి. ఈ చిత్రంలో అఖిల్ సరసన సాయేషా కథానాయికగా నటిస్తోంది.
Advertisement
CJ Advs