పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘గబ్బర్‌సింగ్’కి సీక్వెల్‌గా ‘గబ్బర్‌సింగ్2’ చిత్రం చేయబోతున్నారని గత కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రానికి మొదట సంపత్ నంది దర్శకత్వం వహిస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని పవర్ దర్శకుడు బాబీ డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ చిత్రం మే 29న ప్రారంభం కాబోతోంది. ఇప్పటివరకు పవర్‌స్టార్ అభిమానులు గబ్బర్‌సింగ్ 2 విషయంలో చాలా కన్‌ఫ్యూజన్‌లో వున్నారు. ఈ సినిమా వుంటుందా, వుండదా? వుంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. అసలు గబ్బర్‌సింగ్2 చిత్రాన్ని పవర్‌స్టార్ చెయ్యడం లేదన్న వార్తలు కూడా వినిపించాయి. ఎట్టకేలకు ఈ చిత్రాన్ని మే 29న ప్రారంభిస్తున్నారు. శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటివరకు వున్న అపోహలు తొలగిపోయాయి. విదేశాల్లో వున్న దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రం కోసం ఇండియా వచ్చాడట. వచ్చీ రావడంతోనే డైరెక్టర్ బాబీతో గబ్బర్‌సింగ్2 గురించి డిస్కషన్ మొదలు పెట్టాడట. గబ్బర్‌సింగ్ ఆడియో ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. దాన్ని మించేలా గబ్బర్‌సింగ్2 పాటలు చేస్తానని దేవి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆల్రెడీ ఈ చిత్రం కోసం మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ చేసాడట దేవి. మే 29న ఈ చిత్రం స్టార్ట్ అవుతుందన్న వార్త అభిమానుల్లో ఆనందాన్ని నింపుతోంది. ఈమధ్యకాలంలో సినిమా స్టార్ట్ అవ్వకముందే ఎక్స్‌పెక్టేషన్స్ భారీగా పెరిగిపోయిన సినిమా ఇది. మరి ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కి ధీటుగా గబ్బర్‌సింగ్2 చిత్రాన్ని తెరకెక్కించడం అంటే బాబీకి కత్తిమీద సాములాంటిదేనని సినీవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.