>ఎప్పటికప్పుడు టాలెంట్ ఉన్న కొత్తవారికి అవకాశం ఇవ్వడంలో ముందుండే హీరో మాస్‌మహారాజా రవితేజ. ఇప్పటివరకు ఆయన అనేక మంది దర్శకులను ఇతర టెక్నీషియన్స్‌ను పరిచయం చేశాడు. ఇప్పుడు తాజాగా ఆయన మరో కొత్త కుర్రాడికి బంగారం వంటి చాన్స్ ఇస్తున్నాడు. ఓ కొత్త మ్యూజిక్ కంపోజర్‌కి అవకాశం ఇచ్చాడు. ‘గాలిపటం, కెవ్వుకేక, అలా ఎలా, జోరు’ సినిమాలకు సంగీతం అందించిన యంగ్ మ్యూజిక్‌డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియోకి తన తదుపరి చిత్రం ‘బెంగాల్‌టైగర్’లో అవకాశం ఇచ్చాడు. ఇందులో తమన్నా, రాశిఖన్నాలు హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ చిత్రం దర్శకుడు సంపత్‌నందికి భీమ్స్ మంచి స్నేహితుడు. కాగా ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 17న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.