Advertisement
Google Ads BL

'డీ అంటే డీ' మూవీ ప్లాటినం డిస్క్ వేడుక..!


శ్రీకాంత్, సోనియామాన్ జంటగా మహాలక్ష్మి ఎంటర్ ప్రైజెస్ పతాకంపై జొన్నలగడ్డ శ్రీనివాసరావు తెరకెక్కిస్తున్న సినిమా 'డీ అంటే డీ'. ఈ చిత్రం ప్లాటినం డిస్క్ వేడుక సోమవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన పరుచూరి వెంకటేశ్వరరావు ప్లాటినం డిస్క్ లను చిత్ర బృందానికి అందించారు. ఈ సందర్భంగా పరుచూరి వెంకటేశ్వరావు మాట్లాడుతూ "ఈ సినిమాకు కథను అందించిన భూపతి రాజ ఎన్నో హిట్ సినిమాలను పని చేసారు. చక్రి గారు ఈ సినిమాకు మంచి మ్యూజిక్ అందించారు. ఈ సమయంలో ఆయన లేకపోవడం దురదృష్టకరం. పోసాని కృష్ణమురళి ఏ పాత్రలో అయిన ఇమిడిపోయి నటిస్తాడు. ఈ సినిమాతో దర్శకుడైన జొన్నలగడ్డ నిర్మాతగా మారుతున్నారు. ఈ సినిమా ఘన విజయాన్ని సాధించి ఆయనకు మంచి లాబాలు తీసుకురావాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.

Advertisement
CJ Advs

బి.గోపాల్ మాట్లాడుతూ "తమిళంలో, తెలుగులో ఎన్నో హిట్ సినిమాలకు కథ అందించిన భూపతి ఈ సినిమాకు కూడా కథ అందించాడు. చంద్రబోస్ సాహిత్యం అధ్బుతంగా ఉంది. శ్రీకాంత్ మంచి నటుడు. ఏ పాత్రకైన ఆయన యాప్ట్ అవుతాడు. జొన్నలగడ్డ శ్రీనివాసరావు కు ఈ సినిమా మంచి సక్సెస్ ను ఇవ్వాలి" అని చెప్పారు.

తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ "చిన్న వయసులోనే శ్రీకాంత్ 100 కు పైగా సినిమాలలో నటించాడు. భూపతి నాకు 'దొంగ రాస్కెల్' అనే సినిమాకు కథను రాసాడు. ఆయన ఈ సినిమాకు కథ అందించడం సంతోషంగా ఉంది. చక్రి మ్యూజిక్ బావుంది. ఈరోజు చిన్న సినిమాలు విడుదలవ్వడానికి చాలా కష్టంగా ఉంది. మే 1న సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కాని థియేటర్లు దొరకపోవడం వలన మే 15న రిలీజ్ చేయనున్నారు" అని చెప్పారు.

భూపతి రాజ మాట్లాడుతూ "ఈ సినిమాలో హీరోకి, హీరోయిన్ కు మధ్య ఓ ప్రొఫెషనల్ క్లాష్ అవుతుంది. శ్రీకాంత్ గారికి, పిల్లలకి మధ్య జరిగే సన్నివేశాలతో సినిమా కథ అంతా సాగుతుంటుంది" అని చెప్పారు.

చంద్రబోస్ మాట్లాడుతూ "సినిమా ఆడియో బహుళప్రజాధారణ పొందింది. ఈ మూవీలో ప్రసన్న అనే సాంగ్, ఐటెం సాంగ్ ఒకటి, చదువు గురించి చెప్పే పాట హైలైట్ గా నిలుస్తాయి. సాంగ్స్ రిలీజ్ అయ్యి సక్సెస్ అయ్యాయి. సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా" అని చెప్పారు.

పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ "28 సంవత్సరాలుగా నేను సినీ ఇండస్ట్రీలో ఉన్నాను. జొన్నలగడ్డ చేసిన స్నేహితులు సినిమాకి నాతో మాటలు రాయించుకున్నారు. ఎన్నో హిట్ సినిమాలను ఆయన తెలుగు ప్రేక్షకులకు అందించాడు. అలాంటిది ఈరోజు ఆయన సినిమా విడుదల చేయడానికి చాలా అడ్డంకులు వస్తున్నాయి. సహాయం చేయాల్సిన మీడియా రెండు ముక్కలుగా విడిపోయింది. ఈరోజు నేను మీడియాను తక్కువ చేసి మాట్లాడట్లేదు. పరుచూరి బ్రదర్స్ దగ్గర పని చేసి ఓ రైటర్ గా పరిచయమయినప్పుడు మీడియా నాపై  ఎన్నో కథనాలు ప్రచురించి అన్ని విధాలా ప్రోత్సహించారు. ఇండస్ట్రీలో కొంతమంది పెద్దలు ఐకమత్యంగా ఉండకుండా వాళ్ళలో వాళ్ళు తగాదాలు పెట్టుకొని సినిమాలపై పడుతున్నారు. అందరు మంచోల్లే. కాని సినిమాను నాశనం చేస్తున్నారు. రెండు చానెల్స్ కే యాడ్స్ ఇవ్వాలంటే చిన్న సినిమాల పరిస్థితేంటి. దయచేసి మీరంతా యూనిటీగా గా ఉండి మీడియా ను యూనిటీ గా ఉంచండి" అని చెప్పారు.

శ్రీకాంత్ మాట్లాడుతూ "భూపతి కథ చెప్పినప్పుడు వేరే ప్రొడ్యూసర్ అయితే కాంప్రమైస్ అవుతారేమో అని జొన్నలగడ్డ శ్రీనివాసరావు గారే ప్రొడ్యూసర్ గా మారారు. తాప టెక్నీషియన్స్ తో సినిమా చేయించారు. సినిమాలో పాటలన్నీ చంద్రబోస్ గారే రాసారు. చక్రి మంచి మ్యూజిక్ అందించాడు" అని చెప్పారు.

రాజేంద్ర కుమార్ మాట్లాడుతూ "ఈ సినిమా ఓ మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించారు. కమర్షియల్ గా కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. చంద్రబోసు రాసిన పాటలు ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తాయి. చోటా భీమ్ పాత్రలో 10 సంవత్సరాల స్కూల్ బోయ్ లా బ్రహ్మానందం కనిపించనున్నారు. ఆయన చేసిన డాన్సు, అల్లరి, స్పోర్ట్స్ ఈ సినిమా సెకండ్ హాఫ్ కి అధ్బుతంగా కుదిరాయి" అని చెప్పారు.

జొన్నలగడ్డ శ్రీనివాసరావు మాట్లాడుతూ "ఈ చిత్రం ఇంత అధ్బుతంగా వచ్చిందంటే దానికి కారణం ఈ సినిమాకి పని చేసిన సాంకేతిక నిపుణులు, నటీనటులే. ఈ సినిమాలో హీరో గా నటించిన శ్రీకాంత్ కి, బ్రహ్మానందంకు మధ్య జరిగే సన్నివేశాలు హైలైట్ గా నిలుస్తాయి" అని అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ కోటి, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, అదుర్స్ రఘు తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి కథ: భూపతి రాజ, మాటలు: రాజేంద్ర కుమార్, సంగీతం: చక్రి , ఆర్ట్: చిన్నా, ఎడిటర్: గౌతం రాజు, కెమెరా: సి.హెచ్.గోపీనాథ్, ఫైట్స్: కనల్ కన్నన్, నిర్మాతలు: గరికిపాటి జ్యోతిక, సి.ఎస్.రెడ్డి, గ్రంధి సూర్య ప్రభాకర్, నిర్మాత - స్క్రీన్ ప్లే- దర్శకత్వం: జొన్నలగడ్డ శ్రీనివాసరావు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs