Advertisement
Google Ads BL

'కిక్2' సినిమా ఆడియో ఆవిష్కరణ..!


రవితేజ, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నందమూరి కళ్యాన్ రామ్ నిర్మిస్తున్న చిత్రం 'కిక్2'. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ శనివారం హైదరాబాద్‌లో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా విచ్చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ బిగ్‌ సీడీని ఆవిష్కరించి తొలి సిడిను హీరో రవితేజకు అందించారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం అందించిన ఈ ఆడియో జంగ్లీ మ్యూజిక్‌ ద్వారా మార్కెట్‌లోకి విడుదలైంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ "సీతారామరాజు సినిమా షూటింగ్ సమయం నుండి నాకు రవితేజ గారు తెలుసు. కొంతమంది జీవితంలో సక్సెస్ అయితే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇక్కడ నేను అలా ఫీల్ అయ్యేది రవితేజ, కళ్యాణ్ రామ్ విషయంలోనే. కళ్యాన్ ఎప్పుడు ఎన్టీఆర్ మనవడిని, హరికృష్ణ కొడుకిని అని ఫీల్ అవ్వదు. అదే తన సక్సెస్ సీక్రెట్. అసిస్టెంట్ డైరెక్టర్ గా ప్రయాణం మొదలు పెట్టిన రవితేజ ఈరోజు అగ్రకథానాయకుల్లో ఒకరిగా ఎదగడానికి చాలా కష్టపడ్డాడు. సురేందర్ రెడ్డి మా కుటుంబ సభ్యుడు. ఆయన చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తయితే కిక్2 ఒక ఎత్తు. ఈ సినిమా ఎంతో కష్టపడి జాగ్రత్తగా చేసాడు. తమన్ మంచి మ్యూజిక్ అందించాడు. జెండాపై కపిరాజు పాట అధ్బుతంగా ఉంది. వక్కంతం వంశి ఈ సినిమాకి మంచి కథను అందించాడు. హీరోయిన్ రకుల్ తో నేను నెక్స్ట్ సినిమా చేస్తున్నాను. ఈ సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరికి మంచి పేరు రావాలి" అని అన్నారు.

Advertisement
CJ Advs

రవితేజ మాట్లాడుతూ "కిక్2 ప్రేక్షకులకు డబల్ కిక్ ఇస్తుందనే ప్రగాడ నమ్మకం నాకుంది. రాజ్ పాల్ యాదవ్ అధ్బుతంగా నటించాడు. ఈ బ్యానర్ లో నటించడం చాలా సంతోషంగా ఉంది. కళ్యాన్ రామ్ చాలా మంచి వ్యక్తి. ఎక్కడా కాంప్రమైస్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకి ఎసెట్ మనోజ్ ఫోటోగ్రఫీ. కిక్ సినిమా తరువాత 6 సంవత్సారాల గ్యాప్ తో సురేందర్ రెడ్డి తో చేస్తున్న కిక్2 హిట్ అయితే కిక్3 చేయడానికి నేను రెడీ. తమన్ మ్యూజిక్ ఫెంటాస్టిక్. యాక్షన్ సన్నివేశాలు రామ్-లక్ష్మణ్ లు ఇరగదీసారు" అని చెప్పారు.

కళ్యాన్ రామ్ మాట్లాడుతూ "వక్కంతం వంశి కథ చెప్పగానే సినిమా చేయాలనుకున్నాం. మా బ్యానర్ లో వస్తున్న ఏడో సినిమా ఇది. సురేందర్ రెడ్డి కి, రవితేజ కు నా ధన్యవాదాలు. సినిమాకి పని చేసిన ప్రతి టెక్నీషియన్ కు నా స్పెషల్ థాంక్స్" అని చెప్పారు.

సురేందర్ రెడ్డి మాట్లాడుతూ "10 సంవత్సారాల తరువాత మరలా ఈ బ్యానర్ ల చేస్తున్నాను. కళ్యాన్ రామ్ లేకపోతే అతనొక్కడే సినిమా చేయలేను. కిక్2 స్టొరీ విని భారీ బడ్జెట్ ఇచ్చి  ఈ సినిమాను నిర్మించాడు. మాస్ మహారాజ రవితేజ ఒప్పుకుంటే కిక్3 చేయడానికి కూడా రెడీ ఆయనలో అంత ఎనర్జీ ఉంటుంది. టెక్నీషియన్స్ అందరు ఎంతగానో సహకరించారు. తమన్ తో నా జర్నీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది" అని చెప్పారు.

తమన్ మాట్లాడుతూ "ఈ సినిమాలో 13 సంవత్సరాలు గల స్ఫూర్తి అనే అమ్మాయితో ఓ పాట పాడించాను. దానికి సురేందర్ రెడ్డి, కళ్యాణ రామ్ సపోర్ట్ చేసారు. సురేందర్ రెడ్డి, రవితేజ తో కిక్ సినిమా చేసాను. కిక్2 సినిమా చేసే అవకాశం కూడా ఇచ్చినందుకు ధన్యవాదాలు" అని చెప్పారు.

రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ "ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ తో అసోసియేట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. నన్ను ఈ సినిమాలో భాగం చేసినందుకు కళ్యాన్ రామ్ గారికి ధన్యవాదాలు. సురేందర్ రెడ్డి గారు సినిమా కోసం ఎంతగానో ప్రోత్సహించారు. రవితేజ గారితో వర్క్ చేయడం చాలా ఫన్ గా అనిపించింది" అని చెప్పారు.

బోయపాటి శీను థియేట్రికల్ ట్రైలర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "ట్రైలర్ బావుంది. ట్రైలర్ చూస్తే టైటిల్ ఎందుకు పెట్టారో తెలుస్తుంది. రవితేజ మంచి ఎనర్జీ ఉన్న నటుడు. కళ్యాన్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మంచి సినిమాలను నిర్మిస్తున్నాడు. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి అందరికి మంచి పేరు రావాలి" అని అన్నారు.

బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ "సురేందర్ రెడ్డి, రవితేజ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది" అని అన్నారు.

వక్కంతం వంశి మాట్లాడుతూ "ఎం అంచనాలు లేకుండా కిక్ సినిమా చేసాం. కిక్2 సినిమాకి ఎక్స్ పెక్టేషన్స్ ఎక్కువయిని. రవితేజ హీరోగా, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమా రెండింతలు ఎంటర్ టైన్మెంట్ ఇస్తుంది"అని అన్నారు.    

బ్రహ్మానందం మాట్లాడుతూ "కిక్ సినిమా ఎంత పెద్ద హిట్ ఇచ్చిందో దానిని రెట్టింపు చేసి కళ్యాన్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సురేందర్ రెడ్డి మంచి స్టైలిష్ డైరెక్టర్. ఈ సినిమాలో నాకొక విచిత్రమైన క్యారెక్టర్ సృష్టించాడు. తమన్ మ్యూజిక్ ద్వారా సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్ళాడు. ఈ సంవత్సరంలో కిక్2 పెద్ద హిట్ అవుతుంది" అని అన్నారు.

మల్లిఖార్జున్ మాట్లాడుతూ "తన బ్యానర్ లో కళ్యాన్ రామ్ వేరే హీరోతో చేస్తున్న మొదటి ఇది. ఈ బ్యానర్ ద్వారానే నేను దర్శకుడిగా పరిచయమయ్యాను. సినిమా పెద్ద సక్సెస్ అయ్యి లాబాలు తీసుకురావాలి" అని అన్నారు.

అనిల్ రావిపూడి మాట్లాడుతూ "నన్ను డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ చేసిన సంస్థ ఇది. కళ్యాన్ రామ్ గారికి ప్రొడ్యూసర్ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. కిక్ ను మించిన స్థాయిలో కిక్2 హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో లగడపాటి శ్రీధర్, రాజ్ పాల్ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, సమీర్, పృథ్వి, కొమరం వెంకటేష్, బాబి, ఎడిటర్ గౌతం రాజు తదితరులు పాల్గొన్నారు.  

ఈ చిత్రానికి ఎడిటర్: గౌతం రాజు, ఆర్ట్; నారాయణ్ రెడ్డి, ఫైట్స్: రామ్ లక్ష్మణ్.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs