Advertisement
Google Ads BL

మరలా రెడీ అవుతోన్న నితిన్‌!


‘చిన్నదాననీకోసం’ తర్వాత మరో సినిమాను సెట్స్‌పైకి తేకుండా వినాయక్‌, అఖిల్‌ చిత్రం నిర్మాణంలో బిజీగా ఉన్నాడు హీరో నితిన్‌. పూరీజగన్నాథ్‌తో ఓ సినిమా చేస్తానని చెప్పినప్పటికీ దానికి చాలా సమయం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ఈ గ్యాప్‌లో ఆయన ఇంకో ప్రాజెక్ట్‌ను ఓకే చేశాడు. మల్లిడి వేణు అనే దర్శకుడిని పరిచయం చేస్తూ...ఓ సినిమా చేయనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్‌వర్క్‌ కూడా పూర్తయింది. స్టోరీని విన్న నితిన్‌ వెంటనే తమ స్వీయ నిర్మాణ సంస్థ శ్రేష్ఠ్‌ మూవీస్‌పై ఈ చిత్రం చేయనున్నాడు. ప్రస్తుతం ప్రీపొడక్షన్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి. జూన్‌ మొదటివారంలో ఈ చిత్రం ప్రారంభంకానుంది. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs