అవతార్ మెహర్ బాబా క్రియేషన్స్ పతాకంపై మెహెర్‌రాజ్, మనీషా జంటగా నటించిన చిత్రం ‘నిలువవే వాలుకనులదానా’!. ఈ చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రస్తుతం ఎడిటింగ్ జరుపుకుంటోంది.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అర్జున్ ప్రవాస్ మాట్లాడుతూ.. ‘నిర్మాణంలో రాజీ పడకుండా ఈ చిత్రాన్ని కేరళ, వైజాగ్, అరకులలోని బ్యూటీఫుల్ లోకేషన్స్‌లో తెరకెక్కించాం. ముఖ్యంగా మెహర్‌రాజ్ నటన, అతను చేసిన డ్యాన్స్‌లు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. అన్నీ వర్గాల ప్రేక్షకులు కలిసి చూడవలసిన అద్భుతమైన ప్రేమకథా చిత్రమిది. శాంతిసూర్యం అందించిన సంగీతం హృదయాల్ని అత్తుకుంటుంది. ముఖ్యంగా మా నిర్మాత అందించిన సహకారం మరువలేనిది. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఎడిటింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెలాఖరున ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియోను విడుదల చేయనున్నాం. జూన్‌లో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం...’ అన్నారు.
Advertisement
CJ Advs