Advertisement
Google Ads BL

మళ్ళీ వాయిదా పడిన ‘లయన్‌’ రిలీజ్‌?


ఈమధ్య కాలంలో సినిమాలు ఎనౌన్స్‌ చేసిన డేట్‌ రిలీజ్‌ కావడం చాలా కష్టంగా మారిపోయింది. తెలుగు సినిమాలకైనా, డబ్బింగ్‌ సినిమాలకైనా ఈ పరిస్థితి తప్పడం లేదు. ఇప్పుడు ఈ పరిస్థితి బాలకృష్ణ లేటెస్ట్‌ మూవీ ‘లయన్‌’ వచ్చిందని తెలుస్తోంది.  మొదట ఈ చిత్రాన్ని మే 1న మేడే సందర్భంగా రిలీజ్‌ చేస్తామని నిర్మాత ప్రకటించారు. చివరికి అది కాస్తా మే 8కి వెళ్ళింది. ఈ రిలీజ్‌ డేట్‌ను కన్‌ఫర్మ్‌ చేస్తూ ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి ఒక ప్రెస్‌మీట్‌ కూడా ఏర్పాటు చేశారు. మే 8 దగ్గర పడుతున్న సమయంలో మళ్ళీ ఈ సినిమా రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్టు సమాచారం అందుతోంది. ఈ సినిమా రిలీజ్‌ వాయిదా వేయడానికి కారణాలేమిటో తెలియరానప్పటికీ మే 8న ‘లయన్‌’ రిలీజ్‌ లేదనే విషయం మాత్రం కరెక్టే అంటున్నాయి సినీవర్గాలు. మే 14న ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయడానికి నిర్మాత సిద్ధమవుతున్నట్టు సమాచారం.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs