Advertisement
Google Ads BL

'బెస్ట్ యాక్టర్స్' మూవీ ఆడియో రిలీజ్..!


నందు, షామిలి జంటగా మారుతి టీమ్ వర్క్స్ పతాకంపై అరుణ్ పవర్ దర్శకత్వంలో, కుమార్ అన్నమ్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా 'బెస్ట్ యాక్టర్స్ జీవితంలో'. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ ఆదివారం హైదరాబాద్‌లోని తాజ్ డెక్కన్ హోటల్ లో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా విచ్చేసిన నటుడు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజేంద్రప్రసాద్ బిగ్‌ సీడీని ఆవిష్కరించి తొలి సీడీని హీరో తరుణ్ కి అందించారు. జీవన్ సంగీతం అందించిన ఈ ఆడియో శ్రేయాస్  మ్యూజిక్‌ ద్వారా మార్కెట్‌లోకి విడుదలైంది. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ "చిత్రబృందమంతా సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల ద్వారా టెక్నికల్ గా అరుణ్ తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాను ఆయన డైరెక్ట్ చేస్తున్నాడంటే ఖచ్చితంగా హిట్ అవుతుందని తెలుస్తోంది. ట్రైలర్ చాలా బావుంది. జీవన్ మ్యూజిక్ వింటుంటే ఇళయరాజా గారు గుర్తొచ్చారు. కుమార్ గొప్ప వ్యక్తి. సినిమా మంచి సక్సెస్ ను సాధించి కుమార్ కు లాభాలు రావాలని కోరుకుంటున్నాను" అని తెలిపారు.

Advertisement
CJ Advs

హీరో తరుణ్ మాట్లాడుతూ "యంగ్ టాలెంట్ ను ప్రోత్సహించడంలో మారుతి గారు ముందుంటారు. యూత్ ఫుల్ సినిమాలు తీయడంలో ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. ఆయన ఆధ్వర్యంలో ఈ సినిమా రావడం సంతోషకరమైన విషయం. సినిమా ట్రైలర్ చూస్తుంటే ఫ్రెష్ గా కలర్ ఫుల్ గా ఉంది. ట్రైలర్ లో వచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమా ఆడియో అధ్బుతంగా ఉన్నాయి. అరుణ్, నందు మంచి టాలెంటెడ్ పర్సన్స్. సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తారు. కుమార్ గారికి ఈ సినిమా పెద్ద సక్సెస్ ను ఇచ్చి వరుసగా మరిన్ని సినిమాలను ప్రొడ్యూస్ చేయాలని ఆశిస్తున్నాను" అని అన్నారు.

ఎమ్.ఎమ్.కీరవాణి మాట్లాడుతూ "జీవన్ సంగీతం అధ్బుతంగా ఉంటుంది. 'హ్యాపీడేస్' సినిమా పాటలు ఎంత రెఫ్రెషింగ్ గా అనిపించాయో ఈ సినిమా పాటలు కూడా అలానే అనిపించాయి. పాటలన్నీ ఎనర్జిటిక్ గా, మెలోడియస్ గా ఉన్నాయి. సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను" అని అన్నారు. 

సురేందర్ రెడ్డి మాట్లాడుతూ "మారుతి అనే బ్రాండ్ నుండి వస్తున్న సినిమా ఇది. ఆర్టిస్టులను, టెక్నీషియన్స్ ఎంచుకోవడంలో మారుతి కి ప్రత్యేకమైన శైలి ఉంది. చాలా గ్యాప్ తరువాత కుమార్ గారు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాతో ఆయనకు మంచి విజయం రావాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.

మారుతి మాట్లాడుతూ "ఇదొక మలయాళం రీమేక్ సినిమా. అరుణ్ అధ్బుతంగా డైరెక్ట్ చేసాడు. బెస్ట్ యాక్టర్ అనే పదానికి యాప్ట్ అయిన రాజేంద్రప్రసాద్ గారు ఆడియోను ఆవిష్కరించడం సంతోషంగా ఉంది. జీవన్ మంచి మ్యూజిక్ అందించాడు. టీమ్ అంత చాలా కష్టపడి పనిచేసారు" అని చెప్పారు.

అరుణ్ పవర్ మాట్లాడుతూ "నాకు ఈ అవకాశం ఇచ్చిన మారుతి గారికి నాకెంతగానో సహకరించిన ప్రొడ్యూసర్ కుమార్ గారికి నా ధన్యవాదాలు. ఈ సినిమాకి కిట్టు మంచి డైలాగ్స్ రాసాడు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమా స్థాయిని పెంచింది. ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నాం" అని చెప్పారు.

కుమార్ అన్నమ్ రెడ్డి మాట్లాడుతూ "సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని ఆశిస్తున్నాను" అని తెలిపారు.

జీవన్ మాట్లాడుతూ "నాకు ఈ అవకాశం ఇచ్చిన మారుతి గారికి, అరుణ్ కి, ప్రొడ్యూసర్ కి నా ధన్యవాదాలు. సినిమా రీరికార్డింగ్ కు, సాంగ్ కు నా సింగర్స్ ఎంతగానో సపోర్ట్ చేసారు. సినిమా ఖచ్చితంగా మంచి హిట్ అవుతుంది" అని అన్నారు.

నందు మాట్లాడుతూ "అరుణ్, నేను కలిసి చేసిన 'అతిథి' అనే షార్ట్ ఫిలిం ద్వారా మారుతి గారు మాకు ఈ అవకాశం ఇచ్చారు. నా జీవితంలో చాలా ముఖ్యమైన సినిమా ఇది. చాలా నమ్మకంతో ఉన్నాం" అని చెప్పారు.

షామిలి మాట్లాడుతూ "జీవన్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. నందుకి, నాకు మధ్య వచ్చే రొమాంటిక్ విజువల్ గా చాలా బావుంటుంది" అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో క్రతి, శేష, బివిఎస్ రవి , డైరెక్టర్ బాబీ, తాగుబోతు రమేష్, సప్తగిరి తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: విశ్వ, ఎడిటింగ్: ఉద్ధవ్ , డైలాగ్స్: కిట్టు , దాసరి వెంకట్ సతీష్.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs