రాజమౌళి కాపీ కొట్టారా?!
గతంలో విడుదలైన 'బాహుబలి' మేకింగ్ వీడియో ఒక హాలీవుడ్ ప్రోమోను పోలి ఉందని... రాజమౌళి దాన్ని మక్కికి మక్కి కాపీ కొట్టారని ప్రచారం జరిగింది. అలాంటి ప్రచారం జరిగితే సినిమాకి నష్టమని భావించిన `బాహుబలి` బృందం వెంటనే స్పందించింది. మేం ఆ ప్రోమో కాన్సెప్ట్‌ని కొనుగోలు చేశామని... అది కాపీ కాదని వివరణ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ ‘బాహుబలి’ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా కాపీ అంటూ ఆరోపణలు వస్తున్నాయి. మేడేని పురస్కరించుకొని `బాహుబలి` ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని విడుదల చేశారు. ఒక చిన్న పిల్లాడిని చేత్తో పట్టుకొని నీళ్లల్లో వస్తున్నప్పటి స్టిల్లును పోస్టర్‌గా విడుదల చేశారు. అయితే ఆ పోస్టర్ 1988లో విడుదలైన `సైమన్ బిచ్` పోస్టర్‌కి కాపీ అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంత భారీ సినిమాని తీస్తున్న రాజమౌళి పోస్టర్లు, టీజర్లు కాపీ చేయాల్సిన అవసరం ఎందుకో అర్థం కావడం లేదని పలువురు మాట్లాడుకొంటున్నారు. `సైమన్ బిచ్` పోస్టర్, `బాహుబలి` పోస్టర్ పక్కపక్కనే ఉన్న పోస్ట్‌లు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. మరి ఈ విషయంలో రాజమౌళి స్పందన ఎలా ఉంటుందో చూడాలి.
Advertisement
CJ Advs
Show comments
Advertisement
Google Ad amp 3
CJ Ads
Advertisement
Google Ad amp 3
CJ Ads