ఇటీవల సినిమాలపైన సినిమాలే, హీరోలపైన హీరోలే పంచ్‌లు వేసుకోవడం పరిపాటిగా మారింది. మొన్నటికి మొన్న 'ఆగడు' సినిమాలో మహేష్ చేత ఇలాంటి డైలాగుల్ని బోలెడన్ని చెప్పించాడు శ్రీనువైట్ల. ఆ విషయం కొన్ని రోజులు పరిశ్రమలో కాక పుట్టించింది. చివరికి మహేషే కలగజేసుకొని `ఆ డైలాగులు మా సినిమాలపైన వేసుకొన్నవే` అని సర్దిచెప్పాడు. మంచు మనోజ్ కూడా ఆమధ్య 'కరెంట్ తీగ'లో 'చెట్టు పేరు చెప్పి కాయ పేరు చెప్పి` అంటూ ఓ డైలాగ్ వదిలాడు. ఇప్పుడు రామ్ వంతొచ్చింది. తన కొత్త సినిమా `పండగ చేస్కో` కోసం... ``ధైర్యమనేది బ్లడ్ లో వుంటది , బాడీలో వుంటది, ఫ్యామిలీలో వుంటది, గుండెల్లో నుంచి వచ్చే దమ్ములో వుంటదని ఎదవ సొల్లు చెప్పడం నాకు ఇష్టముండదురా`` అంటూ వీరలెవిల్లో ఓ డైలాగు చెప్పేశాడు. మన స్టార్ కథానాయకులు ఎక్కువగా బ్లడ్, ఫ్యామిలీ, దమ్ము.. అంటూ డైలాగులు చెబుతుంటారు. ఆ కథానాయకులందరిపైనా ఇప్పుడు రామ్ సెట్టైర్ వేసినట్టయింది. నిన్నటినుంచి పరిశ్రమలో ఇదే విషయం గురించి మాట్లాడుకొంటున్నారు. ఇలాంటి డైలాగులు లేనిపోని కాంట్రవర్సీలకి దారితీసే అవకాశముందన్న అభిప్రాయాలు పరిశ్రమలో వినిపిస్తున్నాయి.
Advertisement
CJ Advs