Advertisement
Google Ads BL

పెద్ద సూపర్‌స్టార్‌ బర్త్‌డే చిన్న సూపర్‌స్టార్‌కి స్పెషల్‌


ప్రతి ఏడాది సూపర్‌స్టార్‌ కృష్ణ పుట్టినరోజుకి మహేష్‌ నటించిన చిత్రం తాలూకు ఫస్ట్‌ లుక్‌ లేదా టీజర్‌ లాంచ్‌ చేయడం ఆనవాయితీగా మారింది. అదే ఆనవాయితీని కొనసాగిస్తూ ఈ సంవత్సరం సూపర్‌స్టార్‌ కృష్ణ పుట్టినరోజున మహేష్‌ కొత్త చిత్రం ప్రారంభం కాబోతోంది. మహేష్‌, వెంకటేష్‌లతో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని రూపొందించిన శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో పి.వి.పి. సినిమా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా ‘బ్రహ్మోత్సవం’ పేరుతో రూపొందే ఈ చిత్రాన్ని సూపర్‌స్టార్‌ కృష్ణ పుట్టినరోజైన మే 31న ప్రారంభిస్తున్నారు. ‘సీతమ్మ వాకిట్లో..’ చిత్రాన్ని మంచి ఫ్యామిలీ ఎమోషన్స్‌తో రూపొందించిన శ్రీకాంత్‌ అడ్డాల మరి ‘బ్రహ్మోత్సవం’ చిత్రంలో ఎలాంటి ఎమోషన్స్‌తో ఆడియన్స్‌ని ఆకట్టుకోబోతున్నాడో, సూపర్‌స్టార్‌ మహేష్‌ని ఏ విధంగా ప్రజెంట్‌ చెయ్యబోతున్నాడు అనేది తెలుసుకోవాలంటే సూపర్‌స్టార్‌ కృష్ణ బర్త్‌డే వరకు ఆగాల్సిందే. అన్నట్టు ఈ చిత్రానికి స్టార్‌ సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు వర్క్‌ చేయడం విశేషం. శ్రీకాంత్‌ అడ్డాల చేసిన రెండు చిత్రాలకు సంగీతం అందించిన మిక్కీ జె. మేయర్‌ ఈ చిత్రానికి కూడా తన స్వరాలను అందించబోతున్నాడు. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs