కళ్యాణ్‌రామ్ ఓకే చెప్పాడు..!
సాయిధరమ్ తేజ్‌తో `పిల్లా నువ్వు లేని జీవితం` తీసి హిట్టు కొట్టాడు ఎ.ఎస్.రవికుమార్ చౌదరి. ఆ తర్వాత స్టార్ హీరోలతో సినిమా చేయాలనుకొన్నాడు. `పిల్లా నువ్వు లేని జీవితం` సినిమాని నిర్మించిన దిల్‌రాజు సంస్థలోనే మరో సినిమా చేస్తే స్టార్ హీరోలతో పనిచేసే అవకాశం వస్తుందని భావించిన చౌదరి ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. తాజాగా ఆ ప్రయత్నాలు కూడా ఓ కొలిక్కి వచ్చినట్టు సమాచారం. ఎ.ఎస్.రవికుమార్ చెప్పిన కథని కళ్యాణ్‌రామ్‌తో తీస్తే బాగుంటుందని దిల్ రాజు భావించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ కథకు సంబంధించి స్క్రిప్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. త్వరలోనే సినిమా గురించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశమున్నట్టు తెలిసింది. కళ్యాణ్‌రామ్ కూడా ఇటీవల `పటాస్`తో హిట్టు కొట్టాడు. దీంతో ఇదొక క్రేజీ కాంబినేషన్ అయ్యింది.
Advertisement
CJ Advs
Show comments
Advertisement
Google Ad amp 3
CJ Ads
Advertisement
Google Ad amp 3
CJ Ads