పూరి అంటే అంతే మరి...!
సినిమాకి కొబ్బరికాయ కొట్టినరోజునే విడుదల తేదీని ప్రకటించే ఏకైక టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్. ఆయన అనుకొన్న సమయానికి సినిమాని పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాడు. కొన్ని సినిమాల్నైతే అనుకొన్న తేదీ కంటే ముందుగానే విడుదల చేసి శభాష్... అనిపించుకొన్నాడు. అందుకే పూరి సినిమాలు ఎప్పుడూ కాస్ట్ ఫెయిల్యూర్స్ ఉండవని చెబుతుంటారు టాలీవుడ్ నిర్మాతలు. తాజాగా మళ్లీ జెట్ స్పీడుతో `జ్యోతిలక్ష్మి` సినిమా చిత్రీకరణని పూర్తి చేశాడు పూరి. ఛార్మి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ కేవలం 37 రోజుల్లోనే పూర్తయింది. నేటి నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వ్యవహారాలు మొదలవుతాయి. అనుకొన్నట్టుగానే మే లోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. లేడీ ఓరియెంటెడ్ సినిమాగా ఈ చిత్రం రూపొందింది. పూరి, ఛార్మి, సి.కళ్యాణ్ ముగ్గురూ కలిసి నిర్మిస్తున్నారు.
Advertisement
CJ Advs
Show comments
Advertisement
Google Ad amp 3
CJ Ads
Advertisement
Google Ad amp 3
CJ Ads