నూతన నటీనటులు పవన్‌రెడ్డి, సిద్ధార్థ, సునీల్ జైశ్వాల్, కిషోర్, అంజలీరావ్ ప్రధాన పాత్రధారులుగా వర్ష ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై రమేష్ ముక్కెర దర్శకత్వంలో పవన్‌రెడ్డి నిర్మించిన చిత్రం ‘2000 క్రోర్ బ్లాక్‌మనీ’. ఈ చిత్రం తొలికాపీ రెడీ చేసుకొని మే 3వ వారంలో విడుదలకు సిద్ధమవుతోంది.
దర్శకుడు రమేష్ ముక్కెర మాట్లాడుతూ ‘‘మైండ్‌గేమ్‌తో సాగే ఈ సినిమాని సరికొత్త కథ, కథనాలతో తెరకెక్కించడం జరిగింది. ముఖ్యంగా రాజకీయ నాయకులు, పోలీసుల రాబరీల మధ్య జరిగే మైండ్‌గేమ్ చాలా ఆసక్తికరంగా సస్పెన్స్‌తో కొనసాగుతుంది. అనుక్షణం ఉత్కంఠతను కొనసాగిస్తూ ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అయ్యేవిధంగా ఈ చిత్రం వుంటుంది’’ అన్నారు.
నిర్మాత పవన్‌రెడ్డి మాట్లాడుతూ ‘‘ఈ చిత్రంలో మెయిన్ లీడ్ రోల్ చేసాను. ఈమధ్యకాలంలో రానటువంటి ఓ సరికొత్త పాయింట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ప్రస్తుతం సమాజంలో జరిగే పాలిటిక్స్ ఏవిధంగా వున్నాయి. సమాజం పట్ల పోలీసులు తీరు ఎలా వుంది? ఒక నలుగురు ఐ.ఐ.టి. విద్యార్థులు గోల్డ్ మెడల్స్ సాధించి ఎంతో ఉన్నతస్థాయికి ఎదగాల్సిన వారు అనుకోని పరిస్థితుల్లో 2000 కోట్లను ఏవిధంగా రాబరీ చేసారు అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఈ సినిమాలో చూపించడం జరిగింది. కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఈ సినిమాలో వున్నాయి. ఆడియన్స్‌కి నచ్చేవిధంగా ఈ చిత్రం వుంటుంది. త్వరలో ఆడియో రిలీజ్ చేసి మే చివరివారంలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఈ చిత్ర విశేషాలను www.2000crore.com వెబ్‌సైట్‌లో చూడవచ్చు’’ అన్నారు.
పవన్‌రెడ్డి, సిద్ధార్థ, అంజలీరావ్, సునీల్ జైశ్వాల్, కిషోర్, సినీమ్యాక్స్ లక్ష్మణ్, చెలుకూరి కుమార్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: దివ్య అండ్ ఉదయ్, సంగీతం: రమేష్ మాల్కెర్, ఎడిటింగ్: గోపి పిండం, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: జనార్థన్‌రెడ్డి ఎల్లనూరు, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, నిర్మాత: పవన్‌రెడ్డి, దర్శకత్వం: రమేష్ ముక్కెర.