‘దశావతారం’, ‘విశ్వరూపం’ వంటి మెస్మరైజింగ్ చిత్రాల తర్వాత కమల్ హాసన్ చేసిన మరో విలక్షణమైన చిత్రం ‘ఉత్తమవిలన్’. తిరుపతి బ్రదర్స్ ఫిల్మ్ మీడియా ప్రై.లి., రాజ్‌కమల్ పిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్స్‌పై ఈరోస్ ఇంటర్నేషనల్ సమర్పణలో ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు సి.కె.ఎంటర్‌టైన్మెంట్స్ ప్రై.లి.బ్యానర్‌పై సి.కళ్యాణ్ అందిస్తున్నారు. రమేష్ అరవింద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మే 1న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో కమల్‌హాసన్, హీరోయిన్లు పూజా కుమార్, ఆండ్రియా, దర్శకుడు రమేష్ అరవింద్, నిర్మాత సి.కళ్యాణ్, కో ప్రొడ్యూసర్ సి.వి.రావు, లైన్ ప్రొడ్యూసర్ జి.కుమార్‌బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా..
నాజర్: టైటిల్‌లాగే చాలా డిఫరెంట్ మూవీ ఇది. ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు హార్ట్ టచ్చింగ్‌గా వుంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇది మ్యూజికల్ మూవీ. ఇందులో చాలా మంచి సంగీతం వుంది. ఇంత మంచి మ్యూజిక్ విని చాలా కాలమైంది. నేను ఈ సినిమాలో ఎవరూ ఎక్స్‌పెక్ట్ చెయ్యని క్యారెక్టర్ చేశాను. ఇప్పటివరకు నేను 500 సినిమాలు చేశాను. కానీ, ఇలాంటి వండర్‌ఫుల్ కామెడీ ఎప్పుడూ చెయ్యలేదు.
ఆండ్రియా: ఈ సినిమా చెయ్యడం ఒక బెస్ట్ ఎక్స్‌పీరియన్స్. ప్రతి ఒక్కరికీ సినిమా స్పెషల్ మూవీ అవుతుంది. ఈ సినిమాలో ఎంతో మంది బ్రిలియంట్ ఆర్టిస్టులు చేశారు. ఈ సినిమా చేయడం నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాను.
సి.కళ్యాణ్: ఈ సినిమా చేయడంలో, సినిమా ఇంత బాగా రావడానికి మొత్తం క్రెడిట్ అంతా కమల్‌హాసన్‌గారికే దక్కుతుంది. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించడంలో నేను ఎంజాయ్ చేస్తున్నాను. ప్రేక్షకులు సినిమాని చూసి ఎంజాయ్ చేస్తారు. నేను ఇప్పటివరకు 54 సినిమాలు తీశాను. ఈరోజు ఈ సినిమా నిర్మాతను నేను అనుకోవడం గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమాలో మా గురువుగారు బాలచందర్‌గారు కూడా ఒక మంచి క్యారెక్టర్ చేయడం నాకెంతో ఆనందాన్ని కలిగించింది. మే 1న ఈ సినిమా విడుదలవుతోంది. తప్పకుండా మీ అందరూ ఈ సినిమాని ఆదరిస్తారని ఆశిస్తున్నాను.
రమేష్ అరవింద్: ఒక మంచి సినిమా చేశాం. మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారా వెయిట్ చేస్తున్నాం. మంచి సినిమా చేస్తే తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని ఇంతకుముందు చాలా సందర్భాల్లో ప్రూవ్ చేశారు. ఈ సినిమాని కూడా మీరు తప్పకుండా ఆదరిస్తారన్న నమ్మకం నాకు వుంది.
పూజా కుమార్: ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ చేసే అవకాశం ఇచ్చిన రమేష్‌గారికి, కమల్‌హాసన్‌గారికి స్పెషల్ థాంక్స్. ఈ సినిమాలో వర్క్ చేయడం గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమా ఒక ట్రెండ్ సెట్టింగ్ మూవీ అవుతుంది.
ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు హీరో కమల్‌హాసన్ సమాధానమిస్తూ..
ఎంతో కష్టపడి మీరు సినిమాలు చేస్తారు. కానీ, రిలీజ్‌కి వచ్చేసరికి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటారు. రెండు, మూడు సినిమాలకు ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేశారు. దీనికి మీరిచ్చే సమాధానం?
సినిమా ఎలా తియ్యాలి, ఎలా రిలీజ్ చెయ్యాలనేది నేర్చుకుంటున్నాం. మేం తీసిన సినిమాని చూసి రిలీజ్ చెయ్యాలా వద్దా అనేది కొంతమంది చెప్తారట. ఈ డెమక్రటిక్ కంట్రీలో ఇలాంటివి జరగకూడదు. మద్రాస్‌లో ఎవరో కేసు వేశారట. మీకు వేరే పనిలేదా? దేశంలో ఎన్నో ముఖ్యమైన విషయాలు వున్నాయి డిస్కస్ చెయ్యడానికి అని జడ్జిగారు వారితో అన్నారట. మేం దీని ద్వారా నేర్చుకున్న కొత్త విషయం ఏమిటంటే మా పని మేం కరెక్ట్ చేస్తే ఎవరికీ ఎలాంటి చెడ్డ ఫీలింగ్ రాదు. హిందూ మతం ఎక్కువగా వున్న ఈ దేశంలో ఆ మతానికి వ్యతిరేకంగా సినిమా తియ్యాలని ఎందుకనుకుంటాము. అయినా ఒక మతానికి వ్యతిరేకంగా సినిమా చెయ్యాలని ఎప్పుడూ అనుకోలేదు. అన్ని మతాల వారు నా కుటుంబానికి సంబంధించినవారే అని ఫీల్ అయ్యే కళాకారుడ్ని.
కమల్ హాసన్ ఉత్తమ హీరోగా కాకుండా ఉత్తమ విలన్‌గా ఎందుకొస్తున్నట్టు?
అందరిలోనూ ఒక విలన్ వుంటాడు. నేను చేసే కొన్ని విషయాలు మీకు నచ్చకపోవచ్చు. కొన్ని పాయింట్ ఆఫ్ వ్యూస్‌లో అందరూ విలన్స్ అయిపోతారు. అలా ఈ సినిమాలో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో నేను విలన్‌ని.
ఈ క్యారెక్టర్ చేయడానికి ఇన్‌స్పిరేషన్ ఏమైనా వుందా?
చాలా మంది కళాకారులు ఇన్‌స్పిరేషన్. అలాగే నేను కూడా దానికి ఇన్‌స్పిరేషనే. ఇది ఒక ఫిల్మ్ యాక్టర్ లైఫ్ గురించి తీసిన సినిమా. ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి. కానీ, ఈ సినిమా స్పెషల్‌గా వుంటుంది. ఇందులోని విషయాల్ని చాలా డిఫరెంట్‌గా చెప్పాం.
ఇందులో చాలా డాన్సులు చేసినట్టున్నారు?
అవునండీ. చాలా రిహార్సల్స్ చేశాం. చాలా కష్టపడ్డాం. చాలా మంచి కొరియోగ్రాఫర్స్ మా సినిమాకి పనిచేశారు. ఈ సినిమాలో ఒక గ్రూప్ డాన్స్ వుంటుంది. అలాంటి గ్రూప్ డాన్స్ ఏ ఇండియన్ సినిమాలోనూ రాలేదు. ఒక హాలీవుడ్ సినిమాలోని డాన్స్ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది.
మీరు తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేస్తున్నారని తెలిసింది?
అవును. ఈ సంవత్సరం తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేసే ఆలోచన వుంది. ఆ వివరాలు త్వరలోనే తెలుస్తాయి అన్నారు ‘ఉత్తమ విలన్’ కమల్‌హాసన్.
కమల్‌హాసన్, జయరామ్, కె.బాలచందర్, నాజర్, ఆండ్రియా, పూజా కుమార్, పార్వతి మీనన్, పార్వతి నాయర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు: కమల్‌హాసన్, సంగీతం: ఎం.జిబ్రాన్, సినిమాటోగ్రఫీ: శ్యామ్‌దత్, ఎడిటింగ్: విజయశంకర్, సమర్పణ: తిరుపతి బ్రదర్స్, ఈరోస్ ఇంటర్నేషనల్, లైన్ ప్రొడ్యూసర్: జి.కుమార్‌బాబు, కోప్రొడ్యూసర్: సి.వి.రావు, నిర్మాత: సి.కళ్యాణ్, దర్శకత్వం: రమేష్ అరవింద్.