విఐపి(విక్టరీ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్) సమర్పణలో శ్రీవెంకటేశ్వర మూవీస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిర్మాత గోపనబోయిన శ్రీనివాస్‌యాదవ్ నిర్మిస్తున్న చిత్రం ‘రణం 2’. రణం చిత్రంతో గోపిచంద్‌కు సూపర్ హిట్ ఇచ్చిన డ్యాన్స్ మాస్టర్ అమ్మరాజశేఖర్ కొంత గ్యాప్ తీసుకుని తానే హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం రణం-2 మూడు ఏళ్ళ తరువాత ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేసుకుని మే 15న విడుదలకు సిద్దమైంది. ఒక మంచి చిత్రానికి కావాలసిన అన్ని రసాలు సమపాళ్లతో వస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రం అమ్మరాజశేఖర్‌కు పూర్వపు వైభవం తీసుకొస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నారు. స్వర్గీయ నటుడు శ్రీహరి నటించిన ఆఖరి చిత్రాల్లో ఒక్కటి ఇది. ఈ చిత్రంలో శ్రీహరి పోషించిన పాత్ర ప్రేక్షకుల గుండెల్లో మరో మారు చిరంజీవిగా నిలిచిపోతారని దర్శక,నిర్మాతలు అంటున్నారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో..
దర్శకుడు అమ్మరాజశేఖర్ మాట్లాడుతూ "ఈ ప్రాజెక్ట్ కోసం 3 ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాను. అనుకోకుండ షెడ్యూల్ షెడ్యూల్‌కి గ్యాప్ వస్తూ వచ్చింది. రణం-2 చిత్రం షూటింగ్ పూర్తి అయింది. సెన్సార్ వారు యు/ఎ సర్టిపికెట్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని మే 15న విడుదల చేస్తున్నాం. ప్రేక్షకులు సినిమాను చూసి మాకు సపోర్ట్ ఇస్తారని అశిస్తున్నాను" అని అన్నారు.
నిర్మాత గోపనబోయిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ "ఈ చిత్రం మూడు ఏళ్ళు షూటింగ్ జరుపుకుంది. ఈ మూడు ఏళ్ళలో ఎన్నో సమస్యలు ఎదురుకున్నాం. మాకు, మా చిత్రానికి శ్రీహరి మరణం తీరని లోటుగా మిగిలిపోయింది. ఈ సినిమాలోని శ్రీహరి గారికి పాత్ర బాగా నచ్చిందని ఈ పాత్ర వల్ల తనకు తప్పకుండ అవార్డు వస్తుంది అని చేప్పేవారు. ఈ చిత్రం మాస్ చిత్రం ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఈ చిత్రం అన్ని ఏరియాలకు బిజినెస్ పూర్తి అయింది. ఆంధ్ర,తెలంగాణ, సీడెడ్ ప్రాంతాలకు పసుపులేటి కన్నమాంబ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. మే 15న చిత్రాన్ని చూసి విజయవంతం చేయాలన్నారు. డిస్ట్రిబ్యూటర్ పసుపులేటి కన్నమాంబ మాట్లాడుతూ "నాకు డిస్ట్రిబ్యూటర్స్ అందరూ తెలుసు. ఏ సినిమా కొంటే బాగా అడుతుంది అని డిస్ట్రిబ్యూటర్స్ మిత్రులు నన్ను అడుగుతూ ఉంటారు. మనం ఏం చెప్పిన వారికి నచ్చిన సినిమాను తీసుకుని చేతులు కాల్చుకుంటారు. ఈ చిత్రం 3 ఏళ్ళు షూటింగ్ జరుపుకున్నా మంచి క్వాలీటీతో ఉంది. నాకు నచ్చింది. నా మిత్రుడు అమ్మరాజశేఖర్ తో కలసి ఈ చిత్రాన్ని అన్ని ఏరియాలు తీసుకుని రిలీజ్ చేస్తున్నాను. ఈ సినిమాను చూసి సక్సెస్ చేయాలి" అని అన్నారు. ఈ కార్యక్రమంలో బాల నటుడు విష్ణు,హీరోయిన్ నిథి, తదితరులు పాల్గోన్నారు.
అమ్మ రాజశేఖర్, నిధి, పృథ్వి, నల్లవేణు, శ్రవణ్, ఫిష్ వెంకట్, సుబ్బరాజు తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమెరామెన్: శ్రీధర్, నిర్మాత: గోపనబోయిన శ్రీనివాస్‌యాదవ్, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: అమ్మ రాజశేఖర్