Advertisement
Google Ads BL

‘కేటుగాడు’ మూవీ ఫస్ట్‌ లుక్‌ లాంచ్‌


తేజస్‌, చాందిని జంటగా వి.ఎస్‌.పి. తెన్నేటి సమర్పణలో వెంకటేష్‌ మూవీస్‌, 100 క్రోర్స్‌ అకాడమీ పతాకాలపై కిట్టు నల్లూరి దర్శకత్వంలో వెంకటేష్‌ బాలసాని నిర్మిస్తున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘కేటుగాడు’. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ శనివారం హైదరాబాద్‌లోని బ్లూ ఫాక్స్‌ హోటల్‌లో జరిగింది. వెంకటేష్‌ మూవీస్‌ బేనర్‌ లోగోను ప్రముఖ నిర్మాత కె.ఎస్‌.రామారావు, మోషన్‌ పోస్టర్‌ను, బాలభాను ‘కేటుగాడు’ ఫస్ట్‌ లుక్‌ను కె.ఎస్‌.రామారావు, రాజీవ్‌ కనకాల సంయుక్తంగా ఆవిష్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో వి.ఎస్‌.పి.తెన్నేటి, నిర్మాత వెంకటేష్‌ బాలసాని, దర్శకు కిట్టు నల్లూరి, హీరో తేజస్‌, చాందిని, సినిమాటోగ్రాఫర్‌ జోషి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా..

Advertisement
CJ Advs

కె.ఎస్‌.రామారావు: ఈ టైటిల్‌, ఈ ఫస్ట్‌లుక్‌ లాంచ్‌.. ఇవన్నీ చూస్తుంటే చాలా యూత్‌ఫుల్‌గా అనిపిస్తున్నాయి. ఇక్కడ వున్నవారంతా యూతే. నిజానికి నేను వారి మధ్యలో వుండడం అంత బాగాలేదు. అయినప్పటికీ ఈ చిత్రంలో హీరోగా నటించిన తేజస్‌ నా హీరో. వాళ్ళ నాన్న బాలభాను నాకు ఎంతో దగ్గరివాడు. తేజస్‌ మా ఇంట్లో నన్ను కలుస్తూ వుంటాడు. అతనికి  మంచి హీరో అయ్యే లక్షణాలు వున్నాయి. ఈ చిత్రం అతనికి హీరోగా మంచి పేరు తెస్తుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌కి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

రాజీవ్‌ కనకాల: ఈ బేనర్‌తో అసోసియేట్‌ అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. తేజస్‌ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ఎమోషనల్‌ పెర్‌ఫార్మెన్స్‌ కూడా బాగా చేశాడు. ఒక హీరోకి వుండాల్సిన అన్ని క్వాలిఫికేషన్స్‌ తేజస్‌లో వున్నాయి. తేజస్‌ మంచి హీరో అవ్వాలనుకున్న కలని కిట్టు నిజం చేయడానికి ట్రై చేస్తున్నాడు. తప్పకుండా ఈ సినిమా పెద్ద హిట్‌ అవుతుంది. కిట్టు తియ్యాలనుకున్న సినిమా కోసం ఎక్కడా వెనకాడకుండా అనుకున్న ఔట్‌పుట్‌ రావడంలో నిర్మాత వెంకటేష్‌గారు ఎంతో సపోర్ట్‌ చేశారు. 

కిట్టు నల్లూరి: ఈ కథ చెప్పగానే దాన్ని నమ్మి సినిమా తియ్యడానికి ముందుకొచ్చిన నిర్మాతలు వెంకటేష్‌గారికి, వి.ఎస్‌.పి.తెన్నేటిగారికి థాంక్స్‌. ఒక మంచి సినిమా చెయ్యడానికి కావాల్సినవి అన్నీ ప్రొవైడ్‌ చేశారు. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది.

తేజస్‌: ఉలవచారు బిర్యాని తర్వాత చాలా కథలు నాదగ్గరికి వచ్చాయి. కానీ, అన్నీ ఒకేలా వున్నాయి. కిట్టు మంచి కథ తేవడంతో ఈ సినిమా స్టార్ట్‌ అయింది. ఈ చిత్రంలో నా కోస్టార్‌ చాందినితో వర్క్‌ చేయడం చాలా సంతోషాన్ని కలిగించింది. తెలుగు హీరోయిన్‌ కావడం వల్ల సెట్‌లో ఎలాంటి ప్రాబ్లమ్‌ లేకుండా డైలాగ్స్‌ చెప్పేది. ఈ సినిమా తప్పకుండా మా అందరికీ మంచి పేరు తెస్తుంది.

చాందిని: ఇంత బ్యూటిఫుల్‌ టీమ్‌తో వర్క్‌ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. వెంకటేష్‌గారు చాలా మంచి వారు, వెరీ నైస్‌ పర్సన్‌. ఒక్కరోజు కూడా మేం ఇబ్బంది పడిన సందర్భం లేదు. మమ్మల్ని అంత బాగా చూసుకున్నారు. రాజీవ్‌ కనకాలగారితో రెండు సినిమాల్లో నటించాను. పెర్‌ఫార్మెన్స్‌ పరంగా నాకు ఎన్నో టిప్స్‌ ఇచ్చారు. యూనిట్‌లోని ప్రతి ఒక్కరూ ఎంతో సపోర్టివ్‌గా వున్నారు. 

వి.ఎస్‌.పి.తెన్నేటి: వెంకటేష్‌గారు చాలా మంచి వ్యక్తి. ఆయనతో కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా అనిపించింది. కిట్టు సినిమా స్టార్ట్‌ కావడానికి ఏం చెప్పాడో దాని కంటే బాగా తీశాడు. సాధారణంగా సినిమా స్టార్ట్‌ అయినపుడు అంతా ఆనందంగా వుంటారు. కంప్లీట్‌ అయ్యే టైమ్‌కి ఆ ఆనందం అందరిలో కనిపించదు. ఈ సినిమా విషయానికి వస్తే కొబ్బరికాయ కొట్టిన రోజు నుంచి గుమ్మడికాయ కొట్టే రోజు వరకు అందరం హ్యాపీగానే వున్నాం. దానికితోడు సినిమా కూడా బాగా వచ్చింది. మేమంతా సినిమా మీద ఎంతో కాన్ఫిడెంట్‌గా వున్నాం. 

వెంకటేష్‌ బాలసాని: మా బేనర్‌లో చేస్తున్న మొదటి సినిమా ఇది. ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులు, పనిచేసిన టెక్నీషియన్స్‌ అంతా ఎంతో బాగా నన్ను సపోర్ట్‌ చేశారు. సినిమా చాలా బాగా వచ్చింది. సాయికార్తీక్‌గారు చాలా అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ సినిమా మంచి విజయం సాధించి అందరికీ మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను. 

తేజస్‌, చాందిని, సుమన్‌, రాజీవ్‌ కనకాల, సప్తగిరి, స్నిగ్ధ, భావన, చంద్రశేఖర్‌, అజయ్‌, పృథ్వి, ప్రవీణ్‌, ప్రభాస్‌ శ్రీను, ఫిష్‌ వెంకట్‌, అదుర్స్‌ రఘు, సత్య తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్‌, సినిమాటోగ్రఫీ: మల్హర్‌భట్‌ జోషి, పాటలు: శ్రీమణి, కాసర్ల శ్యామ్‌, భాషాశ్రీ, బాలాజీ, బి.సుబ్బరాయశర్మ, మాటలు: పి.రాజశేఖరరెడ్డి, ఎడిటింగ్‌: పి.వెంకటేశ్వరరావు, భాషాశ్రీ, ఫైట్స్‌: నందు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: అచ్చిబాబు ఎం., సంపత్‌కుమార్‌ ఎ., సమర్పణ: వి.ఎస్‌.పి.తెన్నేటి, నిర్మాత: వెంకటేష్‌ బాలసాని, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కిట్టు నల్లూరి. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs