స్టైలిష్ కథ కావాలంటున్న నాగ్..!
తన ఇద్దరు కొడుకులూ కథానాయకులుగా కొనసాగుతున్నారు. మామూలుగా అయితే తనయులు ఎంట్రీ ఇచ్చాక తండ్రులు కాస్త స్లో అవుతుంటారు. తమ వయసుకు తగ్గ కథల్ని ఎంచుకొంటూ సినిమాలు చేస్తుంటారు. అయితే నాగార్జున మాత్రం తగ్గేదే లేదంటున్నాడు. తనయులతోనే పోటీ పడతానంటున్నాడు. ` స్టైలిష్ కథలుంటే వినిపించండి` అని ఆయన దర్శకుల్ని అడుగుతున్నాడంటే ఆయన జోరేంటో అర్థమవుతోంది. తనయులతో సినిమాలు తీస్తున్న దర్శకులందరితోనూ నాగార్జున ఒకే మాట చెబుతున్నాడు. ``వాళ్లతో హిట్టు సినిమా తీసి రండి, నాతో కలిసి సినిమా చేసే ఛాన్స్ ఇస్తా`` అంటున్నాడు. సుధీర్‌వర్మకి కూడా అలాగే మాటిచ్చాడు నాగ్. `దోచేయ్` రిజల్ట్ చూసుకొని సుధీర్‌తో నిజంగానే ఓ సినిమా చేయాలనుకొన్నాడు. తనకు సినిమా బాగా నచ్చడంతో ``నాకొక స్టైలిష్ కథని సిద్ధం చేయ్`` అని సుధీర్‌వర్మకి చెప్పాడట. మరి క్రైమ్, థ్రిల్లర్ సినిమాలు తీసే సుధీర్‌వర్మ నాగ్ కోసం ఎలాంటి కథ సిద్ధం చేస్తాడో చూడాలి. ప్రస్తుతం నాగార్జున రెండు సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. కార్తీతో కలిసి నటిస్తున్న సినిమా తొలి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తయింది. సోగ్గాడే చిన్ని నాయనాకి సంబంధించి మరో కొత్త షెడ్యూల్ మొదలవుతుంది.
Advertisement
CJ Advs
Show comments
Advertisement
Google Ad amp 3
CJ Ads
Advertisement
Google Ad amp 3
CJ Ads