Advertisement
Google Ads BL

సెన్సార్‌ పూర్తి చేసుకున్న ‘దొంగాట’ రిలీజ్‌కి రెడీ


లక్ష్మీ మంచు, అడవి శేష్‌ ప్రధాన పాత్రధారులుగా విద్యా నిర్వాణ సమర్పణలో మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై ఎన్‌.వంశీకృష్ణ దర్శకత్వంలో లక్ష్మీ మంచు నిర్మిస్తున్న ఔట్‌ అండ్‌ ఔట్‌ ఎంటర్‌టైనర్‌ ‘దొంగాట’. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. మే 1న ఈ చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యడానికి నిర్మాత లక్ష్మీ మంచు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లక్ష్మీ మంచు, దర్శకుడు వంశీకృష్ణ, నటుడు మధునందన్‌, రఘు కుంచె, సినిమాటోగ్రాఫర్‌ భాస్కర్‌ సామల, కోప్రొడ్యూసర్‌ గాంధీ తరఫున నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా..

Advertisement
CJ Advs

వంశీకృష్ణ: మా సినిమా సెన్సార్‌ కంప్లీట్‌ అయింది. సినిమా చూసిన సెన్సార్‌ సభ్యుల నుంచి చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. దాదాపు అరగంట మా సినిమా గురించి మాట్లాడారు. సినిమా ఇంత బాగా రావడానికి సహకరించిన యూనిట్‌లోని ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఈ సినిమా ఔట్‌పుట్‌ విషయంలో నేను చాలా హ్యాపీగా వున్నాను. ఇది ఔట్‌ అండ్‌ ఔట్‌ ఎంటర్‌టైనర్‌. సాయిమాధవ్‌గారు కృష్ణం వందే జగద్గురుం చిత్రానికి చాలా పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌ రాశారు. ఫస్ట్‌ టైమ్‌ ఈ సినిమాకి కామెడీ డైలాగ్స్‌ చాలా బాగా రాశారు. ఆర్టిస్ట్‌ మధునందన్‌గారు షూటింగ్‌ టైమ్‌లో మాకు చాలా హెల్ప్‌ఫుల్‌గా వున్నారు. 

సాయిమాధవ్‌ బుర్రా: చాలా మంచి సినిమా చేశానన్న ఫీలింగ్‌ నాకు కలిగింది. కృష్ణవందే జగద్గురుం చిత్రం మట్టికి, మనిషికి వున్న సంబంధం గురించి తీసిన సినిమా. గోపాల గోపాల దేవుడికి, మనిషికి వున్న సంబంధంపై వచ్చిన సినిమా. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు ప్రేమకి, మనిషికి వున్న సంబంధాన్ని తెలియజెప్పే సినిమా. ఈ దొంగాట మనీకి, మనిషికి వున్న రిలేషన్‌పై తీసిన సినిమా. ఎంటర్‌టైన్‌మెంట్‌ అంటే కేవలం నవ్వించడం మాత్రమే కాదు. కామెడీతోపాటు మరో యాంగిల్‌లో మనం ఆలోచించే విధంగా ఈ సినిమా వుంటుంది. ఇలాంటి సినిమా కోసం నేను వెయిట్‌ చేశాను. కామెడీ సినిమాకి కూడా నేను డైలాగ్స్‌ రాయగలనన్న నమ్మకం నాకు వుంది. ఈ అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

మధునందన్‌: ఈ సినిమా జరుగుతున్నన్ని రోజులూ మేమంతా ఒక ఫ్యామిలీలా కలిసిపోయాం. ఇది హ్యూమర్‌ ఎమోషన్స్‌ మీద తీసిన సినిమా. వంశీ ఫస్ట్‌ టైమ్‌ డైరెక్ట్‌ చేస్తున్నట్టు కాకుండా ఎంతో ఎక్స్‌పీరియన్స్‌ వున్నవాడిలా చేశాడు. 

రఘు కుంచె: ఈ సినిమాలో లక్ష్మీగారు పాడిన పాటను కంపోజ్‌ చేసే అవకాశం రావడం నిజంగా హ్యాపీగా వుంది. నిజానికి ఇది ఒక మామూలు పాట. ఈ పాటని లక్ష్మీగారు పాడడం వల్లే ఇంత క్రేజ్‌ వచ్చింది. ఇప్పటికే ఈ పాట 90 పర్సెంట్‌ జనానికి రీచ్‌ అయింది. ఈ పాటని విజువల్‌గా కూడా చాలా బాగా తీశారు. క్లారిటీతోపాటు కామన్‌ సెన్స్‌ వున్న డైరెక్టర్‌ వంశీకృష్ణ. సినిమాని చాలా అద్భుతంగా తీశాడు. ఈ సమ్మర్‌కి నవ్వుల చిరుజల్లులు కురిపించడానికి ఈ సినిమా వస్తోంది. 

లక్ష్మీ మంచు: మా సినిమా సెన్సార్‌ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. మే 1న ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయబోతున్నాం. మరో విశేషం ఏమిటంటే ఈ సినిమాని నైజాం, సీడెడ్‌, ఆంధ్రా ఏరియాల్లో అమ్మేయడం జరిగింది. ఇంకా ఓవర్సీస్‌, బెంగుళూరు వంటి చిన్న ఏరియాలు వున్నాయి. అవి కూడా ఈ వారంలో కంప్లీట్‌ అయిపోతాయి. ఒక ప్రొడ్యూసర్‌గా ఫస్ట్‌ టైమ్‌ బిజినెస్‌ విషయంలో చాలా రిలాక్స్‌డ్‌గా వున్నాను. ఈ సినిమాకి కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన గాంధీగారు నాకు ఎంతో సపోర్ట్‌ చేశారు. ఆయన లండన్‌లో వున్నప్పటికీ ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్‌ తెలుసుకుంటూ సినిమా బాగా రావడంలో తోడ్పడ్డారు. ఇలాంటి ప్రొడ్యూసర్స్‌ ఇండస్ట్రీకి చాలా అవసరం. ఆయనతో మా అసోసియేషన్‌ ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో నేను పాడిన పాట పక్కన పెడితే 9 మంది హీరోలు కలిసి చేసిన పాట నిజంగా సినిమాకి హైలైట్‌. నేను పాడిన పాటకు వరికుప్పల యాదగిరిగారు మంచి సాహిత్యాన్ని అందించారు. రఘు కుంచెగారు ఎక్స్‌లెంట్‌గా ట్యూన్‌ చేశారు. ఈ సినిమాని ఇంత అద్భుతంగా డైరెక్ట్‌ చేసిన వంశీకృష్ణతో నాకు 15 సంవత్సరాల పరిచయం వుంది. ఈ సినిమా తర్వాత ఆయన పెద్ద డైరెక్టర్‌ అయిపోతారన్న నమ్మకం నాకు వుంది. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs