Advertisement
Google Ads BL

‘శైలు’ ఆడియోను ఆవిష్కరించిన ఆర్యన్‌ రాజేష్‌


కిరణ్‌, షాలు చౌరాసియా జంటగా, శ్రీవిఘ్నేశ్వర ప్రొడక్షన్స్‌ పతాకంపై సందీప్‌ దర్శకత్వంలో మరపట్ల కళాధర్‌ చక్రవర్తి, జగత్‌ విఖ్యా బండి నిర్మిస్తున్న చిత్రం ‘శైలు’. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ శుక్రవారం ప్రసాద్‌ ల్యాబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన హీరో ఆర్యన్‌ రాజేష్‌ ఆడియోను ఆవిష్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు శ్రీవాస్‌, ఇ.సత్తిబాబు,   365 డేస్‌ నిర్మాత బి.వెంకటేష్‌, సంగీత దర్శకుడు కిషన్‌ కవాడియా, దొడ్డిపట్ల వాసు,  హీరో కిరణ్‌, హీరోయిన్‌ షాలు చౌరాసియా, సహనిర్మాతలు కిషోర్‌ కొసరాజు, రాజేష్‌ బండి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా..

Advertisement
CJ Advs

ఆర్యన్‌ రాజేష్‌: పాటలు, ట్రైలర్‌ చాలా బాగున్నాయి. సినిమా కూడా బాగుంటుందని ఆశిస్తున్నాను. ఈ సినిమా మంచి విజయం సాధించి అందరికీ మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను.

శ్రీవాస్‌: లక్ష్యం టైమ్‌లో ఈ చిత్ర దర్శకుడు సందీప్‌ నా దగ్గర అసిస్టెంట్‌ చేద్దామని వచ్చాడు. ఈమధ్య వచ్చి ఒక సినిమా డైరెక్ట్‌ చేశానని, ఆడియో ఫంక్షన్‌కి రావాలని ఇన్‌వైట్‌ చేశాడు. అందుకే ఇక్కడికి వచ్చాను. పాటలు, ట్రైలర్‌ బాగున్నాయి. సందీప్‌ చాలా కాన్ఫిడెంట్‌గా వున్నాడు. సినిమా విషయంలో కూడా అంతే కాన్ఫిడెంట్‌గా వుంటే తప్పకుండా మంచి సినిమా అవుతుంది. ఇది విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో చేసిన సినిమాలా అనిపిస్తోంది. అందరికీ నచ్చే అన్ని ఎలిమెంట్స్‌ ఈ చిత్రంలో వున్నాయని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది.

ఇ.సత్తిబాబు: శైలు అనే అందమైన టైటిల్‌తో విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో తీసిన ఈ సినిమాలోని పాటలన్నీ డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో వున్నాయి. ఒక మంచి సినిమా తీసి వుంటారనుకుంటున్నాను. తప్పకుండా ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది.

హీరో కిరణ్‌: మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీ నుంచి వచ్చిన నాకు మా కుటుంబ సభ్యుల ఎంకరేజ్‌మెంట్‌ చాలా వుంది. సాధారణంగా సినిమాల్లోకి వెళ్తానంటే మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీలో ఒప్పుకోరు. కానీ, నాకు వున్న ఇంట్రెస్ట్‌ చూసి మావాళ్ళు నన్ను ప్రోత్సహించారు. ఛాన్సుల కోసం తిరుగుతున్న నాకు సందీప్‌ పరిచయమయ్యారు. ఆయన చేస్తున్న సినిమాలో నేనే హీరో అని చెప్పారు. చెప్పడమే కాకుండా నిర్మాతల్ని కూడా ఒప్పించి నాతో ఈ సినిమా చేశారు. ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 

షాలు చౌరాసియా: ఈ సినిమాలో నా క్యారెక్టర్‌ చాలా బాగుంటుంది. ఇంత మంచి టీమ్‌తో వర్క్‌ చేయడం నిజంగా నా అదృష్టం. అందరం ఒక ఫ్యామిలీలా కలిసి పనిచేశాం. డైరెక్టర్‌ సందీప్‌ అన్నయ్య నాకు ఎంతో సపోర్ట్‌ చేశారు. కిరణ్‌ పెర్‌ఫార్మెన్స్‌ చాలా బాగుంది. చాలా మంచి క్యారెక్టర్‌ చేశాడు. మేమెంతో కష్టపడి చేసిన ఈ సినిమా తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను.

సందీప్‌: ఈ సినిమా నేను చేయడానికి కారకులైన నిర్మాతలకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఇ.వి.వి.సత్యనారాయణగారంటే చాలా ఇష్టం. అలాగే ఆర్యన్‌ రాజేష్‌గారికి ఎప్పటి నుంచో ఫ్యాన్‌ని. ఈమధ్యకాలంలో కామెడీ సినిమాలు చాలా తగ్గిపోయాయి. ఆ లోటును ఈ సినిమా భర్తీ చేస్తుందని నమ్ముతున్నాను. ఈ కథను మొదట కొంత మంది డైరెక్టర్స్‌కి వినిపించాను. ఈ కథ సినిమా చేస్తే నువ్వు రోడ్డున పడాల్సిందే అన్నారు. సినిమా కంప్లీట్‌ చేసిన తర్వాత సినిమా చూసి చాలా బాగా తీశావని వారే అభినందించారు. ప్రతి ఒక్కరూ ఎంజాయ్‌ చేసే విధంగా ఈ సినిమా వుంటుంది. 

మరపట్ల కళాధర్‌ చక్రవర్తి: మా ప్రాంతంలో సీతారత్నంగారి అబ్బాయి, బందిపోటు వంటి చాలా సినిమాలు షూటింగ్‌ చేశారు. ఎంతో మంచి లొకేషన్స్‌ మా దగ్గర వున్నాయి. ఈ సినిమాని కూడా పూర్తిగా అక్కడే తియ్యడం జరిగింది. సందీప్‌ చెప్పిన దానికంటే చాలా బాగా తీశాడు. ఈ సినిమా తప్పకుండా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం నాకు వుంది.

కిరణ్‌, షాలు చౌరాసియా, రిచా, నరసింహరాజు, బి.వి.వి.చౌదరి, దొడ్డిపట్ల వాసు, సౌమ్య, ప్రసాద్‌, మల్లిక, మహేశ్వరి, కిరణ్మయి, లోకేష్‌, చిరంజీవి, అర్జున్‌ రాయల్‌, వెంకటేష్‌, ధనలక్ష్మీ తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ: దొడ్డిపట్ల వాసు, మాటలు: రఘువంశీ, సంగీతం: కిషన్‌ కవాడియా, ఎడిటింగ్‌: వి.నాగిరెడ్డి, ఆర్ట్‌: కళా వెంకట్‌, సినిమాటోగ్రఫీ: మహిశెర్ల, పాటలు: విజయ్‌శర్మ, రామ్‌ పైడిశెట్టి, నిర్మాతలు: మరపట్ల కళాధర్‌ చక్రవర్తి, జగత్‌విఖ్యా బండి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సందీప్‌. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs