Advertisement
Google Ads BL

‘అందమైన మాయ’ రిలీజ్‌ పోస్టర్‌ విడుదల


కార్తీక్‌, భవ్యశ్రీ, హేమంత్‌ శృతిజలతో యమ్‌.వినోద్‌కుమార్‌ సమర్పణలో విశ్వశ్రీ ఆర్ట్స్‌ బేనర్‌పై నిర్మాత నాగరాజు కొట్టే నిర్మించిన చిత్రం ‘అందమైన మాయ’. ఈ చిత్రం రిలీజ్‌ పోస్టర్‌ను సినిమాటోగ్రఫీ శాఖామంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌, ‘మా’ అసోసియేషన్‌ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌లు ఆవిష్కరించారు.

Advertisement
CJ Advs

ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ మాట్లాడుతూ  ‘‘అందమైన మాయ’ చిత్రాన్ని నిర్మిస్తున్న నాగరాజు కొట్టేకు మంచి విజయం రావాలి, అలాగే దర్శకులు, నటీనటులకు ఈ చిత్రం మంచి పేరు తీసుకురావాలని, కొత్తవాళ్ళకు ఎప్పుడూ ప్రోత్సాహం వుంటుంది’’ అని అన్నారు. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని ‘మా’ అసోసియేషన్‌ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌ అన్నారు.

దర్శకుడు మణీంద్రన్‌ మాట్లాడుతూ  ‘‘మా చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకొంది. చిత్రాన్ని త్వరలో రిలీజ్‌ చేస్తున్నాము. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నోముల నర్సిమయ్య, చిన్న శ్రీశైలం యాదవ్‌, కొట్టే బాలయ్య యాదవ్‌లు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి సంగీతం: సత్యసోమేష్‌, కెమెరా: ప్రేమ్‌ జై, సహనిర్మాత: కె.జ్ఞానేశ్వర్‌, బచ్చల శ్రీనివాస్‌, నిర్మాత: నాగరాజు కొట్టే, దర్శకత్వం: మణీంద్రన్‌.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs