Advertisement
Google Ads BL

‘మా’ పనులకు అడ్డొస్తున్న నరేష్‌..!!


ఈ నెల 17న మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఎన్నికల ఫలితాలు విడుదల కావడంతో సినీ పరిశ్రమలో వేడెక్కిన వాతావరణం కాస్త చల్లబడిరది. ఇటీవల మాజీ ‘మా’ అధ్యక్షుడు మురళీమోహన్‌ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం జరిగిన విషయం తెలిసిందే. 85 ఓట్ల తేడాతో తన సమీప ప్రత్యర్థి జయసుధను ఓడిరచిన రాజేంద్రప్రసాద్‌ తొలుత తనకు అండగా నిలిచిన మెగా ఫ్యామిలీకి పెద్దయిన చిరంజీవిని కలిసి ఆయన  అభినందనలు అందుకున్నారు. సోమవారం నూతన ‘మా’ అధ్యక్షుడు తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిశారు. కేసీఆర్‌ ఆయనను శాలువాతో సత్కరించి, పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడతామని తెలిపిన విషయం తెలిసిందే. 

Advertisement
CJ Advs

ఇదంతా బాగానే ఉంది. ఎన్నికల ముందు ఎన్ని జరిగినా అందరినీ కలుపుకుంటూ పోతామన్న రాజేంద్రప్రసాద్‌ తమతో చర్చించకుండా కేసీఆర్‌ని కలవడం పద్దతిగా లేదని జయసుధ ప్యానల్‌లో గెలుపొందిని నరేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రారంభంలోనే రాజేంద్రప్రసాద్‌ ఇలా చేస్తే రెండేళ్ళు కలిసి ఎలా పనిచేస్తాం అని నరేష్‌ అంటున్నారు. అలాగైతే రాజేంద్రప్రసాద్‌తో మొదటి నుంచి కలిసి ఉన్న శివాజీరాజాను, ఏడిద శ్రీరామ్‌ను, కాదంబరి కిరణ్‌కు తీసుకెళ్ళకుండా వెళ్లారు. మరి వాళ్లు ఎంత ఆగ్రహం వ్యక్తం చేయాలి అని కార్యవర్గ సభ్యులు అంటున్నారు. ఇది పెద్ద విషయం కాదనీ, నరేష్‌ అతిగా ప్రవర్తించి పెద్ద ఇష్యూ చేస్తున్నాడనీ వారు అంటున్నారు. ఎన్నికల సమయంలో కూడా నరేష్‌, హేమ చేసిన అతి పలువురిని ఇబ్బంది పెట్టిన విషయం విధితమే. ఇలాంటివన్నీ పక్కన పెట్టి నరేష్‌ ముందుకెళ్తే బావుంటుందనీ, ప్రతి పనికి ‘చెప్పి  వెళ్లాలి.. చెప్పులేసుకెళ్లాలి’ అంటే ఏ పని జరగదనీ, ‘మా’ అభివృద్ధికి తోడ్పడేలా కృషి చేయాలని వారు సూచించినట్లు సమాచారం. ఇలాగే ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకుని ఏ పని ముందుకెళ్ళకుండా నరేష్‌ అడ్డుపడతాడేమోననే గుసగుసలు ఫిలినగర్‌లో వినబడుతున్నాయి. 

మెగా ఫ్యామిలీ నుంచి ఆరు లక్షలు, రోజా నుంచి ఆరు లక్షలు పేద కళాకారుల పెన్షన్ల నిమిత్తం అందుకోవడమే తన తొలి విజయమనీ, తను నివశిస్తున్న హౌసింగ్‌ సొసైటీ నుంచి కోటికి తగ్గకుండా నిధులు సేకరిస్తానని రాజేంద్రుడు తెలిపిన విషయం విధితమే. 

 

 

 

 

 

 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs