ప్రఖ్యాత సౌండ్ ఇంజనీర్ పి. మధుసూదన్‌రెడ్డి(4 )సోమవారం ఉదయం హైదరాబాద్‌లో గుండెపోటుతో మరణించారు. కడప జిల్లా పులివెందులకు చెందిన మధుసూదన్ రెడ్డి టాలీవుడ్‌లో నెంబర్‌వన్ సౌండ్ ఇంజనీర్‌గా పేరు గడించాడు. మధుసూదర్‌రెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు వున్నారు. డీటీఎస్ మధుసూదన్‌రెడ్డి సుపరిచితుడైన ఆయన సౌండ్ డిజైనింగ్‌లో తెలుగు సినిమా రంగానికి కొత్తబాటలు వేశాడు. ‘గోవిందా గోవిందా’ చిత్రంతో రీరికార్డింగ్ అసిస్టెంట్‌గా కెరీర్‌ను మొదలుపెట్టిన ఆయన ఆయన‘సిసింద్రీ’ సినిమాతో ఆడియోగ్రాఫర్‌గా మారారు. 23 ఏళ్ల కెరీర్‌లో దాదాపు 150 సినిమాలకు సౌండ్ రికార్డిస్ట్, డీటీఎస్ మిక్సింగ్ ఇంజనీర్, ఆడియోగ్రాఫర్‌గా, పనిచేశారు. తమ్ముడు, కలిసుందాంరా, మురారి, ఒక్కడు,నువ్వునేను, అతడు బొమ్మరిల్లు, అరుంధతి, రాజన్న, కిక్, మిర్చి, మనంతో పాటు పలు సినిమాలు ఆయనకు చక్కటి గుర్తింపును తీసుకొచ్చాయి. తెలుగు చిత్ర పరిశ్రమలోని అత్యుత్తమ సాంకేతిక నిపుణుల్లో ఒకరిగా పేరుగాంచిన ఆయన తొమ్మిది నంది అవార్డుల్ని అందుకున్నారు. మధుసూదన్ రెడ్డి నిన్న రాత్రి ఒంటిగంట వరకు ‘దోచెయ్’ చిత్రానికి సౌండ్‌మిక్సింగ్ పనులు చేసి ఫైనల్‌కాపీని దర్శక, నిర్మాతకు అందించటం విశేషం.