Advertisement
Google Ads BL

రిలీజ్‌కి రెడీ అయిన ‘కాయ్‌ రాజా కాయ్‌’


రామ్‌ఖన్నా, మానస్‌, జోష్‌ రవి హీరోలుగా, శ్రావ్య, షామిలి హీరోయిన్లుగా మారుతి టాకీస్‌, ఫుల్‌ మూన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై శివగణేష్‌ దర్శకత్వంలో సతీష్‌రాజు వేగేశన నిర్మించిన మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘కాయ్‌ రాజా కాయ్‌’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఏప్రిల్‌ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జె.బి. సంగీత సారధ్యంలో రూపొందిన ఈ ఆడియో సినిమా రిలీజ్‌కి ముందే చాలా పెద్ద హిట్‌ అయింది. ఆడియో సాధించిన విజయాన్ని పురస్కరించుకొని ఆదివారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో ప్లాటినం డిస్క్‌ ఫంక్షన్‌ నిర్వహించింది చిత్ర యూనిట్‌. ఆ ప్లాటినం డిస్క్‌ ఫంక్షన్‌కి కె.ఎస్‌.రామారావు, లగడపాటి శ్రీధర్‌, ఎస్‌.వి.కృష్ణారెడ్డి అతిథులుగా పాల్గొన్నారు. అతిథుల చేతుల మీదుగా యూనిట్‌ సభ్యులకు ప్లాటినం డిస్క్‌లను అందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌ మొత్తం పాల్గొంది.  ఈ సందర్భంగా..

Advertisement
CJ Advs

కె.ఎస్‌.రామారావు: తెలుగు చలన చిత్ర పరిశ్రమకి కొత్త ఎనర్జీని అందించి కొత్త ట్రెండ్‌ని సృష్టించాడు మారుతి. ఈ చిత్రం ట్రైలర్‌ చాలా బాగుంది. ఇదే సినిమాని ఒక స్టార్‌ హీరో చేసి వుంటే చాలా పెద్ద హిట్‌ అయ్యేది. అంత విషయం ఈ సినిమాలో నాకు కనిపిస్తోంది. ‘కాయ్‌ రాజా కాయ్‌’ తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుంది.

ఎస్‌.వి.కృష్ణారెడ్డి: మారుతిగారు వరస హిట్స్‌ సాధిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాత సతీష్‌రాజుగారు నాకు మంచి ఫ్రెండ్‌. ట్రైలర్‌ చాలా బాగుంది. పాటలు కూడా విన్నాను. చాలా బాగున్నాయి. జె.బి.గారు చాలా చక్కని సంగీతాన్ని అందించారు. ఇందులో హీరోలు చాలా బాగున్నారు. ఈ సినిమా డెఫినెట్‌గా సూపర్‌హిట్‌ అవుతుందన్న నమ్మకం కలుగుతోంది. 

లగడపాటి శ్రీధర్‌: ఈ సినిమాలో రన్‌ వుంది, ఫన్‌ వుంది. పరిశ్రమలో 90 శాతం చిన్న సినిమాలే రిలీజ్‌ అవుతాయి. చిన్న సినిమాలతోనే మంచి విజయాలు సాధిస్తున్నారు. అలాగే ఈ సినిమా కూడా పెద్ద హిట్‌ అయి అందరికీ పేరు, నిర్మాతకి లాభాలు రావాలని కోరుకుంటున్నాను.

మారుతి: నా గురించి వేదిక మీద వున్నవారు చాలా చెప్పారు. అయితే నేను ఇండస్ట్రీలో వున్న పెద్దవారిని ఫాలో అవుతాను. ఒక డిస్ట్రిబ్యూటర్‌గా స్టార్ట్‌ అయిన నా కెరీర్‌ ఇప్పుడీ స్థాయికి వచ్చిందంటే అది కె.ఎస్‌.రామారావుగారివల్లే. కామెడీ సినిమాలంటే ఎస్వీ కృష్ణారెడ్డిగారివే. యమలీల ఎన్నిసార్లు చూసానో లెక్కలేదు. ఇండస్ట్రీలోని పెద్దవారి ఆశీస్సులతోనే ముందుకు వెళ్తున్నాను. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్‌ అవ్వాల్సింది. కొన్ని కారణాలవల్ల డిలే అయింది. ప్రాపర్‌గా రిలీజ్‌ చెయ్యాలన్న ఉద్దేశంతోనే ఇన్నిరోజులు ఆగాం. ఈనెల 23న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. అందరూ ఈ చిత్రాన్ని చూసి సూపర్‌హిట్‌ చేస్తారని ఆశిస్తున్నాను. 

రామ్‌ఖన్నా, మానస్‌, జోష్‌ రవి, శ్రావ్య, షామిలీ, హరి, డి.ఎం.కె., రాఘవ, టార్జాన్‌, రోజా తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: జె.బి., సినిమాటోగ్రఫీ: దేవ్‌, ఎడిటింగ్‌: ఉద్దవ్‌ ఎస్‌.బి., ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: శ్రీనివాస్‌ అడ్డాల, నిర్మాణం: ఫుల్‌ మూన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, రచన, దర్శకత్వం: శివగణేష్‌. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs