Advertisement
Google Ads BL

మే 2 న ‘ఆంధ్రాపోరి’ ఆడియో


ప్ర‌సాద్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై ఆకాష్ పూరి, ఉల్కా గుప్తా హీరోహీరోయిన్లుగా రూపొందుతోన్న నూత‌న చిత్రం ‘ఆంధ్రాపోరి’. ర‌మేష్ ప్ర‌సాద్ నిర్మాత‌. రాజ్ మాదిరాజు ద‌ర్శ‌కుడు. షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోoది. Dr. జోశ్యభట్ల సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో మే 2న విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ సందర్భంగా ద‌ర్శ‌కుడు రాజ్ మాదిరాజు మాట్లాడుతూ  ‘‘ప్రసాద్ ప్రొడక్షన్స్ 60 ఏళ్ల చరిత్ర ఉన్న బ్యానర్. ఆ బ్యానర్ లో 2011లో “ఋషి” సినిమా తీశారు. తర్వాత తీస్తున్న సినిమా “ఆంధ్రాపోరి” చిత్రం బ్యూటిఫుల్ టీనేజ్ ల‌వ్‌స్టోరి. 1993లో జరిగే లవ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్‌. ఈ సినిమా 35 రోజులు పాటు నిరవధికంగా షూటింగ్ సింగిల్ షెడ్యూల్ లో పూర్తిచేశాము. ప్రస్తుతం సినిమా రీరికార్డింగ్ జరుపుకుంటోంది. సినిమా రషెష్ చూసిన వాళ్లందరూ సినిమా చాలా బాగా వచ్చిందని అంటున్నారు. ఆంధ్రా, నిజాం, సీడెడ్, ఓవర్సీస్ ఇలా అన్ని ఏరియాల నుంచి మా సినిమా కొనడానికి మంచి ఆఫర్లతో ముందుకొస్తున్నారు.  “అత్తారింటికిదారేది” సహా అనేక హిట్ చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసిన రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ మా చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. Dr. జోశ్యభట్ల గారు బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. ఆడియోని ఆదిత్యా మ్యూజిక్ ద్వారా మే2 న  రాక్ హైట్స్ శిల్పారామంలో నిర్వహించనున్నాం.  అలాగే నిర్మాణానoతర కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాని మే రెండో వారంలో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ర‌మేష్ ప్ర‌సాద్‌గారు మ‌రోసారి నాకు ద‌ర్శ‌కుడిగా అవ‌కాశం ఇచ్చారు.  ఈ ప్రాజెక్ట్ విలువేoటో నాకు బాగా తెలుసు. అందుకు ఆయ‌న‌కి ధన్య‌వాదాలు. అలాగే నేను థాంక్స్ చెప్పుకోవాల్సిన మరో వ్యక్తి పూరి జగన్నాథ్ గారు. స్టార్ డైరెక్టర్ అయినప్పటికీ మా కథపై నమ్మకంతో ఆకాష్ ని మాకు అప్పగించారు. మాకు బాగా సపోర్ట్ చేశారు. ఆకాష్ 17 ఏళ్ల కుర్రాడు. మొదట్లో పూరి అనే పవర్ ఫుల్ బ్యాగేజ్ తో మా దగ్గరికి వస్తున్నాడనగానే ఒక చిన్న భయం కూడా ఏర్పడింది. కానీ తను ఒబిడియెంట్ పర్సన్. తన పరిధులు బాగా తెలిసిన వ్యక్తి. తను కెమెరా ముందుకు వచ్చే సరికి అద్భుతంగా నటించాడు. ఉల్కాగుప్తా ఈ సినిమాలో చక్కగా నటించింది. ఈ సినిమాకి ముందు చాలా మంది హీరోయిన్స్ ను చూసినా ఉల్కాగుప్తాను చూడగానే ఈమె సరిపోతుందని భావించి ఆమెను కలిసి హీరోయిన్ గా ఎంపిక చేశాం. ప్రవీణ్ వనమాలి ఈ సినిమాని తన సినిమాటోగ్రఫీతో మరో లెవల్ కి తీసుకెళ్లాడు.   ఈ సినిమాకి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్.” అన్నారు.  

Advertisement
CJ Advs

ఈ చిత్రంలో పూర్ణిమ, ఈశ్వరీరావు, అరవింద్ కృష్ణ, శ్రీముఖి, ఉత్తేజ్, శ్రీకాంత్, అభినయ, శ్రీతేజ ఇతర తారాగణం. ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ : మహేష్ చదలవాడ, పబ్లిసిటీ డిజైనర్: ఈశ్వర్ అందె, పి.ఆర్.ఒ: సురేంద్ర కె నాయుడు, సంగీతం: Dr.జోశ్యభట్ల, ఆర్ట్: రాజీవ్ నాయర్, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ వనమాలి, డాన్స్: చంద్రకిరణ్, పాటలు: సుద్ధాల అశోక్ తేజ, రామజోగయ్యశాస్త్రి, కిట్టు విస్సాప్రగడ,కృష్ణ మదినేని,  చక్రవర్తుల, నిర్మాత: రమేష్ ప్రసాద్, దర్శకుడు: రాజ్ మాదిరాజ్.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs