Advertisement
Google Ads BL

భీమవరం టాకీస్‌ 'శీనుగాడి లవ్‌స్టోరి'


‘ఓకె ఓకె’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన యువ కథానాయకుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మనవడు ఉదయనిధి స్టాలిన్‌` నయనానందకరతార నయనతార జంటగా నటించిన తమిళ చిత్రం ‘ఇదు కదిర్‌వేలన్‌ కాదల్‌’. తమిళంలో దాదాపు 20 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి ఘన విజయం సొంతం చేసుకొన్న ఈ చిత్రాన్ని ‘శీనుగాడి లవ్‌స్టోరి’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు భీమవరం టాకీస్‌ అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ. పలువురు నిర్మాతలు ఈ చిత్రం డబ్బింగ్‌ రైట్స్‌ కోసం పోటిపడినప్పటికీ` భారీ మొత్తాన్ని చెల్లించి తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ చిత్రం రైట్స్‌ సొంతం చేసుకొన్నారు.‘పద్మశ్రీ’ పురస్కారగ్రహీత డా॥కె.సూర్యారావు సమర్పిస్తున్న ఈ చిత్రంలో సంతానం, శరణ్య, ఛాయాసింగ్‌, హైద్రాబాద్‌ అపోలో హాస్పిటల్‌లో ప్రముఖ డాక్టర్‌ అయిన డా॥భరత్‌రెడ్డి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. సంగీత సంచలనం హేరిస్‌ జైరాజ్‌ స్వరసారధ్యం వహించిన చిత్రానికి ఎస్‌.ఆర్‌.ప్రభాకరన్‌ దర్శకుడు. 

Advertisement
CJ Advs

ఈ చిత్రం గురించి తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ... ‘ప్రేమకథా చిత్రాలను ఆదరించే వారందర్నీ అమితంగా ఆకట్టుకొనే ఈ చిత్రం నయనతార ఫ్యాన్స్‌కు పండగలా ఉంటుంది. హేరిస్‌ జైరాజ్‌ అందించిన బాణీలు తమిళంలో చార్ట్‌బస్టర్స్‌గా నిలిచాయి. పలు అనువాద చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంతానంతో కలిసి ఉదయనిధి స్టాలిన్‌ చేసే కామెడీ ఈ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది. ప్రస్తుతం డబ్బింగ్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నెలాఖరుకు ఆడియో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు.

ఉదయనిధి స్టాలిన్‌, నయనతార, శరణ్య, ఛాయాసింగ్‌, డా॥భరత్‌రెడ్డి ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి సంగీతం: హేరిస్‌ జైరాజ్‌, ఛాయాగ్రహణం: బాలసుబ్రమణియం, సమర్పణ: ‘పద్మశ్రీ’ పురస్కార గ్రహీత డా॥కె.సూర్యారావు, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కథ`స్క్రీన్‌ప్లే`దర్శకత్వం: ఎస్‌.ఆర్‌.ప్రభాకరన్‌!!

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs