Advertisement
Google Ads BL

‘బుడుగు’ చిత్రానికి 30 థియేటర్లు పెరిగాయట


లక్ష్మీ మంచు, శ్రీధర్‌రావు, మాస్టర్‌ ప్రేమ్‌బాబు, బేబీ డాలీ ప్రధాన పాత్రల్లో హైదరాబాద్‌ ఫిలిం ఇన్నోవేటివ్స్‌ పతాకంపై మన్‌మోహన్‌ దర్శకత్వంలో భాస్కర్‌, సారిక శ్రీనివాస్‌ నిర్మించిన హార్రర్‌ థ్రిల్లర్‌ ‘బుడుగు’. ఏప్రిల్‌ 17న విడుదలైన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్‌ వస్తోందని, దీంతో థియేటర్స్‌ కూడా పెంచడం జరిగిందని నిర్మాత సారిక శ్రీనివాస్‌ అంటున్నారు. ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తున్న నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో సక్సెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సక్సెస్‌మీట్‌లో శ్రీధర్‌రావు, మాస్టర్‌ ప్రేమ్‌బాబు, బేబీ డాలి, దర్శకుడు మన్‌మోహన్‌, నిర్మాత సారిక శ్రీనివాస్‌, సంగీత దర్శకుడు సాయికార్తీక్‌, ఎడిటర్‌ శ్యామ్‌ మెంగ పాల్గొన్నారు.

Advertisement
CJ Advs

సారిక శ్రీనివాస్‌: నిన్న మా ‘బుడుగు’ చిత్రాన్ని 100 థియేటర్స్‌లో రిలీజ్‌ చేశాం. అన్నిచోట్ల నుంచి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అందరికీ ఈ సినిమా కనెక్ట్‌ అయింది. ఆడియన్స్‌ నుంచి వస్తున్న రెస్పాన్స్‌ని దృష్టిలో పెట్టుకొని మరో 30 థియేటర్లు పెంచుతున్నాం. మేం చెప్పాలనుకున్న పాయింట్‌ పబ్లిక్‌లోకి బాగా రీచ్‌ అయిందని సినిమా చూసిన ఆడియన్స్‌ చెప్తున్నారు. బిజీగా వుండే పేరెంట్స్‌ లైఫ్‌ ఎలా వుంటుంది, వారి పిల్లలు ఎలా వుంటారు అనేది ఈ సినిమాలో చక్కగా చూపించారని అందరూ అప్రిషియేట్‌ చేస్తున్నారు. మేం చెప్పాలనుకున్నది ఆడియన్స్‌కి రీచ్‌ అయినందుకు చాలా హ్యాపీగా వుంది. ఇందులో మంచు లక్ష్మీగారు తల్లిగా చాలా అద్భుతంగా పెర్‌ఫార్మ్‌ చేశారు. అలాగే శ్రీధర్‌రావు క్యారెక్టర్‌కి మంచి అప్రిషియేషన్‌ వస్తోంది. మాస్టర్‌ ప్రేమ్‌బాబు ఈ చిత్రంలో మెయిన్‌ లీడ్‌ చేసిన ప్రేమ్‌బాబు చిన్నవాడైనప్పటికీ థ్రిల్లింగ్‌ సీన్స్‌లో ఎక్స్‌ప్రెషన్స్‌, బాధలో వున్నప్పుడు అతని నటన చాలా అద్భుతంగా వుందని అందరూ అభినందిస్తున్నారు. ఇక టెక్నికల్‌గా చూస్తే సురేష్‌ ఫోటోగ్రఫీ, సాయికార్తీక్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాని నెక్స్‌ట్‌ లెవల్‌కి తీసుకెళ్ళాయి. డైరెక్టర్‌ మన్‌మోహన్‌ తన చెప్పాలనుకున్న పాయింట్‌ అందరికీ అర్థమయ్యేలా చెప్తూనే ఆడియన్స్‌ని థ్రిల్‌ చేసే ఎలిమెంట్స్‌ని జోడిరచి ఎక్స్‌ట్రార్డినరీగా తీశారు. ఈ సినిమాకి ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

మన్‌మోహన్‌: థియేటర్స్‌లో ఆడియన్స్‌తో కలిసి సినిమా చూసేందుకు వెళ్ళిన నాకు ఆడియన్స్‌ చెప్పిన విషయం విన్నాక ఆశ్చర్యం కలిగింది. ఇది ఫ్యామిలీ సెంటిమెంట్‌తో వున్న సినిమా కదా మీరు హార్రర్‌ మూవీలా ట్రైలర్స్‌గానీ, పోస్టర్స్‌గానీ రిలీజ్‌ చేశారు. అలా కాకుండా ఫ్యామిలీ సీన్స్‌తో పబ్లిసిటీ చేసి వుంటే ఇంకా బాగుండేది అని నాతో అన్నారు. నాకు కూడా నిజమే అనిపించింది. నిజంగానే ఇది ఫ్యామిలీ అంతా కలిసి చూడాల్సిన సినిమా. తల్లిదండ్రులకు పిల్లల మీద ప్రేమ ఎలా వుండాలి, వారు మన ప్రవర్తన చూసి ఎలా ఇన్‌ఫ్లుయెన్స్‌ అవుతారు అనేది చెప్పే ప్రయత్నం చేశాం. సినిమాలో చెప్పినట్టు టచ్‌, టాక్‌, టైమ్‌ ఇవి ప్రతి పేరెంట్స్‌ తప్పకుండా పాటించాల్సినవి. ఈ అంశాలన్నీ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్‌ కావడంతో ఫ్యామిలీ అంతా కలిసి చూస్తున్నారు. ఫ్యామిలీకి వాల్యూ ఇవ్వకపోతే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలియజెప్పే ఈ సినిమాని అందరూ ఆదర్తిస్తున్నందుకు చాలా ఆనందంగా వుంది.

శ్రీధర్‌రావు: సినిమా రిలీజ్‌ అయిన అన్ని ఏరియాల నుంచి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. నిన్నటి నుంచి నాకు చాలా కాల్స్‌ వస్తున్నాయి. ఈ సినిమా చేసే ముందు ఇంతకుముందు నువ్వు చేసిన సినిమాలకు ఇది పూర్తిగా భిన్నంగా వుంటుందని డైరెక్టర్‌గారు చెప్పారు. ఇందులో నా క్యారెక్టర్‌కి నాలుగు షేడ్స్‌ వున్నాయి. ఇప్పటివరకు నన్ను విలన్‌గా చూసిన ఆడియన్స్‌ ఈ సినిమాతో ఫ్యామిలీ హీరోగా కూడా యాక్సెప్ట్‌ చేశారు. కుటుంబ సమేతంగా చూడదగిన సినిమా ఇది. ఎలాంటి వల్గారిటీ లేని క్లీన్‌ మూవీ. ఈ సినిమాకి థియేటర్స్‌ కూడా పెరిగాయి. ప్రేక్షకుల ఆదరణతో ఇంకా పెద్ద సక్సెస్‌ అవ్వాలని కోరుకుంటున్నాను. 

సాయికార్తీక్‌: అందరూ చిన్న సినిమా అంటున్నారు. ఇంత పెద్ద విజయం సాధించిన తర్వాత ఇది చిన్న సినిమా కాదు. మంచి సినిమాని తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని ఈ సినిమా మరోసారి ప్రూవ్‌ చేసింది. ఈ సంవత్సరం పటాస్‌తో నాకు హిట్‌ స్టార్ట్‌ అయింది. ఇప్పుడు ఈ సినిమా కూడా మంచి హిట్‌ అయింది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌కి చాలా మంచి పేరు వస్తోంది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs