Advertisement
Google Ads BL

‘ఫుల్‌ గ్యారెంటీ’ ఆడియో రిలీజ్‌


జ్వాల హీరోగా, మౌనిక హీరోయిన్‌గా యల్లమిల్లి బాలమురళీకృష్ణ సమర్పణలో రోహిత క్రియేషన్స్‌ పతాకంపై బొత్స రామకృష్ణ దర్శకత్వంలో యల్లమిల్లి సాయిసూర్యతేజ, కె.సాయిగిరి నిర్మిస్తున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఫుల్‌ గ్యారెంటీ(లవ్వుకి నవ్వుకి). ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ మంగళవారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో జరిగింది. ఎమెల్సీ రాములు నాయక్‌ బిగ్‌ సి.డి.ని ఆవిష్కరించగా, హీరో నందు ఆడియో సి.డి.ని ఆవిష్కరించి తొలి సి.డి.ని రాములు నాయక్‌కి అందించారు. చిన్నిచరణ్‌ సంగీతం అందించిన ఈ ఆడియో మ్యాంగో మూజిక్‌ ద్వారా మార్కెట్‌లోకి విడుదలైంది. ఇంకా ఈ కార్యక్రమంలో జస్టిస్‌ చంద్రయ్య, జస్టిస్‌ రవికుమార్‌, సంగిశెట్టి దశరథ, హీరో జ్వాల, హీరోయిన్‌ మౌనిక, నిర్మాతలు యల్లమిల్లి సాయి సూర్యతేజ, కె.సాయిగిరి, చిత్ర సమర్పకులు యల్లమిల్లి బాలమురళీకృష్ణ, దర్శకుడు బొత్స రామకృష్ణ, జయంత్‌రెడ్డి, వివేకానందస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా..

Advertisement
CJ Advs

జస్టిస్‌ రవికుమార్‌: వివేకానంద నాకు 1977 నుంచి పరిచయం. ఆయన ఆహ్వానించగానే ఈ ఆడియో ఫంక్షన్‌ వచ్చాను. వారి అబ్బాయి ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం అవుతున్నాడని చాలా సంతోషించాను. టైటిల్‌ ఫుల్‌ గ్యారెంటీ అని పెట్టారు. టైటిల్‌కి తగ్గట్టుగానే సినిమా కూడా గ్యారెంటీగా హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నాను. 

జస్టిస్‌ చంద్రయ్య: మిత్రుడు వివేకానంద స్వామి హైకోర్టులో ప్రముఖ న్యాయవాది. నా గురువుగారైన బి.ఎస్‌.ఎ.స్వామిగారికి అల్లుడు. ఆ రకంగా వారితో నాకు పరిచయం. మూడురోజుల క్రితం వివేకానంద వచ్చి వారి అబ్బాయి హీరోగా నటించిన సినిమా ఆడియో రిలీజ్‌ చెయ్యబోతున్నాం. మీరు తప్పకుండా రావాలని అడిగారు. ఈరోజుల్లో తల్లిదండ్రులు తమ కుమారులు వివిధ రంగాల్లో ఎదగాలని కోరుకుంటున్నారు. శ్రద్ధ, ఆలోచన వుంటే ఎవరైనా అభివృద్ధిలోకి వస్తారు. ఫుల్‌ గ్యారెంటీ అనే ఈ సినిమా పేరులోనే ఒక ప్రత్యేకమైన లక్షణం కనిపిస్తోంది. తప్పకుండా ఈ సినిమా విజయవంతమై అందరికీ మంచి పేరు తేవాలని ఆశిస్తున్నాను. 

రాములు నాయక్‌: జీవితంలో పైకి రావాలంటే కష్టపడే తత్వం వుండాలి. మొదట్లో విజయం సాధించకపోయినా నిరాశ పడకుండా ముందుకు వెళ్తే ఏదో ఒక రోజు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. ఈ సినిమా విషయానికి వస్తే ఫుల్‌ గ్యారెంటీ అని టైటిల్‌లోనే పెట్టారు. కాబట్టి తప్పకుండా వారిని అదృష్టం వరిస్తుంది. తప్పకుండా ఈ సినిమా ఘనవిజయం సాధిస్తుంది.

నందు: చిన్నిచరణ్‌ చాలా మంచి మ్యూజిక్‌ డైరెక్టర్‌. అతని మ్యూజిక్‌ డైరెక్షన్‌లో నేను ఒక సినిమా చెయ్యడం కూడా జరిగింది. పాటలు విన్నాను. ఈ సినిమాకి కూడా చాలా మంచి మ్యూజిక్‌ చేశాడు. ఈ ఆడియోతోపాటు సినిమా కూడా ఘనవిజయం సాధించి నిర్మాతలకు మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను. 

కె.సాయిగిరి: మా గురువుగారు జయంత్‌రెడ్డి పదిసార్లు గిన్నిస్‌ రికార్డ్‌ సాధించారు. ఆయనకి చాలా సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. కానీ, ఆయన నటించడానికి ఒప్పుకోలేదు. కానీ, ఈ సినిమాలో మా మీద అభిమానంతో నటించారు. వారికి ధన్యవాదాలు. ఒక మంచి కథతో మా దర్శకుడు ఈ చిత్రాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించారు. ఇందులో చాలా మంది ప్రముఖ నటీనటులు నటించారు. చిన్ని చరణ్‌ చాలా అద్భుతమైన సంగీతాన్ని అందించారు. తప్పకుండా ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం నాకు వుంది. 

జ్వాల, ప్రవీణ్‌, పవన్‌, మౌనిక, దీప్తి, ఎం.ఎస్‌.నారాయణ, కొండవలస, శ్రీనివాసరెడ్డి, గౌతంరాజు, జీవా, చిత్రం శ్రీను, సూర్య, వేణుగోపాలరావు, ఫణి, కారుమంచి రఘు, రామచంద్ర, షేకింగ్‌ శేషు, సన, విన్ని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: చిన్ని చరణ్‌, సినిమాటోగ్రఫీ: డి.వెంకట్‌రాజు, ఎడిటింగ్‌: అనిల్‌కుమార్‌ జల్లు, డాన్స్‌: రేలంగి కిరణ్‌, సమర్పణ: యల్లమిల్లి బాలమురళీకృష్ణ, నిర్మాతలు: యల్లమిల్లి సాయిసూర్యతేజ, కె.సాయిగిరి, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు, దర్శకత్వం: బొత్స రామకృష్ణ. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs